Advertisement
Google Ads BL

ఆది కొత్త చిత్రం


తెలంగాణ డిప్యూటీ స్పీకర్ శ్రీ తీగల పద్మారావు గౌడ్ గారి చేతులమీదుగా ప్రారంభమైన ఆది కొత్త చిత్రం

Advertisement
CJ Advs

టి విజయ్ కుమార్ రెడ్డి సమర్పణలో శిఖర క్రియేషన్స్ పతాకంపై ఆది సాయి కుమార్, సిమ్రత్  కౌర్ జంటగా భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో యుగంధర్ టీ (గుడివాడ యుగంధర్) నిర్మిస్తున్న ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం .ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన తెలంగాణ డిప్యూటీ స్పీకర్ శ్రీ తీగల పద్మారావు గౌడ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నిర్మాత పిల్లలు కెమెరా స్విచ్ ఆన్ చేయగా,సంజయ్ మెఘా, అరుంధతి  గారు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో 

తెలంగాణ డిప్యూటీ స్పీకర్ శ్రీ తీగల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శిఖర ప్రొడక్షన్స్ బ్యానర్ లో మంచి సినిమా తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఇందులో నటించిన అందరికీ మంచి పేరు రావాలని కోరుకొంటున్నాను. ఈ సినిమాకు సంబంధించి నిర్మాత ( గుడివాడ యుగంధర్) కు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా, ఫైనాన్సియల్ సపోర్ట్ కావాలన్నా నేను వెనకడకుండా ముందుంటానని అందరి ముందు హామీ ఇస్తున్నాను అని అన్నారు.

దర్శకుడు భాస్కర్ బంటుపల్లి మాట్లాడుతూ.. పిలవగానే వచ్చిన తెలంగాణ డిప్యూటీ స్పీకర్ శ్రీ తీగల పద్మారావు గౌడ్ గారికి ధన్యవాదాలు. అక్కడి వరకు వెళ్లడానికి కారణమైన సాధిక్ కు కృతజ్ఞతలు .ఇది నేను చేస్తున్న  రెండవ సినిమా. నిర్మాత నా కథ విన్న వెంటనే నాపై నమ్మకం ఉంచి నాకీ అవకాశం ఇచ్చారు, అందుకు ఆయనకు ధన్యవాదాలు. ఇప్పటివరకూ ఆది సాయికుమార్ తన కెరీర్లో  చేయని విభిన్నమైన పాత్రను పోషిస్తున్నాడు.ఆది గారికి ఈ కథ చెప్పిన వెంటనే కథ నచ్చి ఒప్పుకున్నారు.అలాగే బ్యాక్ ఎండ్ లో ఉండి నాకు సపోర్ట్ చేసిన సాయికుమార్ గారికి ధన్యవాదాలు. రెగ్యులర్ షూటింగ్ మే నుండి స్టార్ట్ చేసి సినిమాను రెండు షెడ్యూల్స్ లలో పూర్తి చేస్తాము .ఇది పూర్తి రామ్ కామ్ ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం.సినిమా మొదలై నప్పటి నుండి ఎండ్ అయ్యే వరకు ప్రేక్షకులు నవ్వే విదంగా ఈ సినీమా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు.

నిర్మాత యుగంధర్ మాట్లాడుతూ.. మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన  తెలంగాణ డిప్యూటీ స్పీకర్ శ్రీ తీగల పద్మారావు గౌడ్ గారికి మా ధన్యవాదాలు. కర్ణాటక డిస్ట్రుబ్యూటర్ అయిన నేను ప్రొడక్షన్ నంబర్ 1 స్టార్ట్ చేసి ఈ సినిమా తీస్తున్నాను. ఈ సినిమా కథను నమ్ముకొని ఆది గారికి ఈ కథ చెప్పగానే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.ఈ రోజు ఉగాది పర్వదినాన ఈ సినిమాను ప్రారంభించాము. ఇకపై నా బ్యానర్ సై చాలా చిత్రాలు వస్తాయి.వచ్చే ప్రతి చిత్రం నుండి సినిమా నుండి వచ్చిన డబ్బులో కొంత భాగం పేద విద్యార్థులకు ఉపయోగిస్తాను.. నేను సినిమాలు తీయడానికి కూడా ముఖ్య కారణం కూడా అదేనని అన్నారు.

హీరో అది సాయికుమార్ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన తెలంగాణ స్పీకర్ గారికి ధన్యవాదాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇలాంటి మంచి క్యారెక్టర్ లో నన్ను ఎంచుకొన్నందుకు దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు. ఇది మంచి కంటెంట్ ఉన్న కథ.ఇది పూర్తి ఏంటర్ టైనర్ మూవీ . అందరికీ ఈ మూవీ నచ్చుతుందని అన్నారు.

హీరోయిన్ సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ.. కథ చాలా బాగుంది. ఇలాంటి మంచి కథలో నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అని అన్నారు.

నటీనటులు: హీరో: ఆది సాయికుమార్, హీరోయిన్: సిమ్రత్ కౌర్.

సాంకేతిక నిపుణులు: బ్యానర: శిఖర క్రియేషన్స్, సమర్పణ: టి. విజయ్ కుమార్ రెడ్డి, మూవీ జోనర్: రాం - కాం ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్ టైనర్, ప్రొడ్యూసర్ : యుగంధర్. టి (గుడివాడ యుగంధర్), రచయిత, డైరెక్టర్: భాస్కర్ బంటుపల్లి, మ్యూజిక్ డైరెక్టర్: సాకేత్ కొమండూరి, ఫోటోగ్రఫీ: a.d.మార్గల్, ప్రొడక్షన్ డిజైనర్: మధు రెబ్బ, ప్రొడక్షన్ కంట్రోలర్: శైలజ గంటి, పి.ఆర్.ఓ: సాయి సతీష్ , రాంబాబు పర్వతనేని.

Aadi New Film:

Aadi Sai Kumar New Movie Launch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs