Advertisement
Google Ads BL

సినిమా మేకింగ్‌ అంటే పాటను కంపోజ్‌ చేసినట్టే


సినిమా మేకింగ్‌ అంటే పాటను కంపోజ్‌ చేసినట్టేనని మణిరత్నం సార్‌ చెప్పారు - ఎ.ఆర్‌.రెహమాన్‌

Advertisement
CJ Advs

జంట ఆస్కార్‌లను అందుకున్న ఎ.ఆర్‌.రెహమాన్‌ తనకు సినిమా ప్రొడక్షన్‌ అనేది పక్కదారి పట్టడంలాంటిదని అనుకున్నారట. కానీ, ఓ పాటను ఎలా కంపోజ్‌ చేస్తారో, సినిమా మేకింగ్‌ కూడా అంతే శ్రద్ధగా చేయాల్సిన పని అని, అచ్చం అలాంటిదేనని ఆయనకు ప్రముఖ దర్శకుడు మణిరత్నం చెప్పారట. ఆ ప్రోత్సాహంతోనే రెహమాన్‌ తన 99 సాంగ్స్ కి స్క్రిప్ట్ సమకూర్చుకున్నారట. దీని గురించి ఎ.ఆర్‌.రెహమాన్‌ మాట్లాడుతూ సినిమా తీయడం అనేది పాటను కంపోజ్‌ చేయడం లాంటిదని ఒకసారి నాతో మణిసార్‌ అన్నారు. మామూలుగా పాటలో ఓ ఇంట్రడక్షన్‌ ఉంటుంది. పాటకో థీమ్‌ ఉంటుంది. ట్యూన్‌ చేస్తాం. ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌ మిక్సింగ్‌ చేస్తాం. ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్‌ జరిగి అందమైన పాటగా రూపాంతరం చెందుతుంది.. దానికి సాహిత్యం సమకూరుస్తాం.. పాట పుట్టుక ఇలా ఉంటుందన్నమాట అని అన్నారు. ఇహాన్‌ భట్‌, ఎడిల్సి వర్గస్‌, మ్యూజిషియన్‌ - డైరక్టర్‌ విశ్వేష్‌ కృష్ణమూర్తితో కలిసి ఆయన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. 99 సాంగ్స్ ని ప్రొడ్యూస్‌ చేశారు రెహమాన్‌. ప్రజల మనసులోని భావాలను కథ ఎంత వరకు ప్రతిబింబించిందనే దాన్ని బట్టే సక్సెస్‌ ఉంటుంది. సౌండ్‌, విజువల్స్ వారిలో మంచి అనుభూతిని మిగులుస్తాయి అని చెప్పారు రెహమాన్‌. 99 సాంగ్స్ ని హిందీ, తమిళ్‌, తెలుగులో ఈ నెల 16న విడుదల చేయనున్నారు. జియో స్టూడియోస్‌ సమర్పిస్తోంది ఈ చిత్రాన్ని. ఎ.ఆర్‌.రెహమాన్‌ ప్రొడక్షన్‌ కంపెనీ వైయం మూవీస్‌ నిర్మిస్తోంది. ఐడియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సహ నిర్మాణ సంస్థ.

Mani Ratnam sir said making a movie is like composing a song says AR Rahman:

Mani Ratnam sir said making a movie is like composing a song says AR Rahman
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs