Advertisement
Google Ads BL

పాన్ ఇండియా లెవల్లో అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి


1980ల కాలంలో భార‌త‌దేశానికి ప్రాతినిధ్యం వ‌హించిన ఒక క‌బ‌డ్డీ ఆట‌గాడి నిజ జీవిత క‌థ ఆధారంగా రూపొందుతోన్న చిత్రం అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి. గ‌న్నెట్ సెల్యులాయిడ్ ప‌తాకంపై శ్రీ‌ని గుబ్బాలా నిర్మిస్తున్న ఈ చిత్రానికి, వేణు కె.సి. ర‌చ‌న చేస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Advertisement
CJ Advs

నూత‌న తార‌లు విజ‌య‌రామ‌రాజు, సిజా రోజ్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. అజ‌య్‌, ద‌యానంద్ రెడ్డి, అజ‌య్ ఘోష్‌, దుర్గేష్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ప్రపంచ కబడ్డీ దినోత్సవం సందర్భంగా అర్జున్ చక్రవర్తి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను పోస్టర్ మరియు వీడియో రూపంలో విడుదలచేశారు. వీడియోను వీక్షిస్తే..

గెలుపులన్నీ మసకబారిన...పతాకాలన్నీ నేలరాలిన...కన్నీళ్ళన్నీ సంద్రాలైన...జ్ఞాపకాలన్నీ నీకై ఎదురుచూసే ....రారా అర్జునా...అడుగే పిడుగై ఓటమే ఓడేలా...కదలిరారా అర్జునా.....అనే మాటలు వినిపిస్తాయి. కబడ్డీ  క్రీడాకారుడు అయిన అర్జున్ ను భావోద్వేగంతో స్టేడియం ప్రతిధ్వనించేలా పిలవటం కనిపిస్తుంది.

ఈ సినిమా గురించి నిర్మాత‌లు మాట్లాడుతూ, రెండు సంవ‌త్స‌రాల క్రితం అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి షూటింగ్ ప్రారంభ‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జ‌మ్ము-క‌శ్మీర్ స‌హా దేశ‌వ్యాప్తంగా 125 పైగా ప్ర‌దేశాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రిపి, 75 శాతం సినిమాని పూర్తి చేశాం అని చెప్పారు.

ఇందులో హీరో పాత్ర ప్ర‌యాణం చిన్న‌త‌నం నుంచి మ‌ధ్య వ‌య‌సు దాకా సాగుతుంది. ఆ వ‌య‌సు తార‌త‌మ్యాలు క‌నిపించ‌డం కోసం హీరో ఏడు ర‌కాల శారీర‌క మార్పుల్ని ప్ర‌ద‌ర్శించ‌డం విశేషం.‌

అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి అనేది పీరియాడిక‌ల్ డ్రామా కావ‌టాన‌.. 1960, 1980ల కాలం నాటి విలేజ్ సెట్ల‌ను, 1960ల నాటి హైద‌రాబాద్ టౌన్ సెట్‌ను క‌ళాద‌ర్శ‌కుడు సుమిత్ ప‌టేల్ ఆధ్వ‌ర్యంలోని ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఎంతో శ్ర‌మ‌కోర్చి ప్రామాణికంగా నిర్మించింది. దాదాపు రెండేళ్ల నిశిత ప‌రిశోధ‌నతో ఈ సెట్ల‌ను నిర్మించారు.

ఈ సినిమాపై నిర్మాత‌లు గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. ఇందులోని గ్రామీణ వాతావ‌ర‌ణం దృశ్య‌ప‌రంగా బాగా ఆక‌ట్టుకుంటుంద‌నీ, సంగీతం, పాత్ర‌ల ప్ర‌యాణం ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకుంటాయ‌నీ వారు చెప్పారు.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న అర్జున్ చ‌క్ర‌వ‌ర్తిని హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో అనువ‌దించి, పాన్ ఇండియా విడుద‌ల కోసం సిద్ధం చేస్తున్నారు.

ARJUN CHAKRAVARTHY, A Hard-Hitting Emotional Sports Drama to get Pan-India Release:

ARJUN CHAKRAVARTHY, Emotional Sports Drama to get Pan-India Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs