Advertisement
Google Ads BL

నా పేరే పెప్సీ ఆంటీ ఫ్రమ్ సీటిమార్


నా పేరే పెప్సీ ఆంటీ.. పక్కా మాస్ సాంగ్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న గోపిచంద్‌, సంప‌త్‌నంది ల సీటీమార్

Advertisement
CJ Advs

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా‌ సీటీమార్‌. గోపిచంద్ కెరీర్‌లోనే  భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మెలొడిబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. భూమిక, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్‌కి, రీసెంట్‌గా విడుద‌లైన జ్వాలా రెడ్డి సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.  కాగా ఈ మూవీ నుండి అప్స‌రా రాణి స్పెష‌ల్ సాంగ్ గా నా పేరే పెప్సీ ఆంటీ.. నా పెళ్లికి నేనే యాంటీ లిరిక‌ల్ సాంగ్‌ని ఈ రోజు విడుద‌ల చేసింది చిత్ర యూనిట్.

నా పేరే పెప్సీ ఆంటీ.. నా పెళ్లికి నేనే యాంటీ.. నీ ఊరేదైతే ఏంటి నా ఒళ్లేరా నీకు ఊటి అంటూ సాగే ఈ పాట‌లో యంగ్ బ్యూటీ అప్సర రాణి హాట్ హాట్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టింది. పక్కా మాస్ ఆడియన్స్ ను అలరించేలా మణిశర్మ మాంచి ఐటెం సాంగ్‌ని కంపోజ్ చేశారనిపిస్తోంది. విపంచి రాసిన ఈ పాట‌ను సింగ‌ర్ కీర్త‌న శర్మ అంతే హుషారుగా ఆల‌పించింది. ఈ సాంగ్ యూత్ అండ్ మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్‌చేయ‌నున్నారు.  

గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రంలో అప్స‌ర రాణి స్పెష‌ల్ సాంగ్‌లో న‌టిస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై, స‌మ‌ర్పణ: పవన్‌ కుమార్, నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్‌ నంది.

Naa Pere Pepsi Aunty From Seetimaarr:

Naa Pere Pepsi Aunty, From Gopichand, Sampath Nandi Seetimaarr Is Creating Sensation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs