అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ థ్రిల్లర్ చిత్రం A- Ad Infinitum
అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన చిత్రం A- Ad Infinitum ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో నూటికి నూరు శాతం సఫలమయ్యింది. ఈ సినిమా పై మొదటినుంచి మంచి అంచనాలు ఉండగా విడుదలైన తొలిరోజు నుంచే బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
మొదటి ఆటనుంచే ట్రెమండస్ రెస్పాన్స్ రాబట్టుకోవడమే కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్ ఉన్న సినిమా గా విమర్శకుల ప్రశంశలు సంపాదించుకుంది. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది అని ప్రేక్షకులు చెప్తున్నారు.. విజయ్ కురాకుల సంగీతం కు మంచి పేరు రాగా అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్నీ అందించారని కితాబు దక్కించుకున్నాడు. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.. థియేటర్లలో ఈ సినిమా కి ఉన్న డిమాండ్ చూసి అమెజాన్ ఫాన్సీ ధరకు ఈ సినిమా ను కొనుగోలు చేసింది. కాగా ప్రస్తుతం అమెజాన్ లో కూడా ఈ సినిమా ఇతర టాప్ సినిమాలకు పోటీ గా నిలుస్తుంది..
నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైన్: బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్: సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్), ఎడిటింగ్: ఆనంద్ పవన్, మణి కందన్ (ఎఫ్‌టిఐఐ), సంగీతం: విజయ్ కురాకుల, నిర్మాత: గీతా మిన్సాల, దర్శకత్వం: యుగంధర్ ముని.