Advertisement
Google Ads BL

ప్రేమ‌తో సినిమా చూసి, మాకు హిట్టివ్వండి


ప్యూర్ ల‌వ్ స్టోరీ రంగ్ దేని ప్రేమ‌తో చూసి, మాకు హిట్టివ్వండి - హీరో నితిన్‌

Advertisement
CJ Advs

* అశేష అభిమానుల మ‌ధ్య క‌ర్నూలులో గ్రాండ్‌గా రంగ్ దే ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌

* ఆద్యంతం న‌వ్వుల‌తో అల‌రించిన ట్రైల‌ర్

* అభిమానుల‌తో సెల్ఫీలు దిగిన నితిన్

* సెన్సార్ పూర్తి.. యు/ఎ స‌ర్టిఫికెట్‌‌‌

నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన రంగ్ దే సినిమా ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ శుక్ర‌వారం రాత్రి క‌ర్నూలులో నితిన్ ఫ్యాన్స్‌, ప్రజల హర్షధ్వానాల మ‌ధ్య గ్రాండ్‌గా జ‌రిగింది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశి నిర్మిస్తున్నారు. మార్చి 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రంగ్ దే విడుద‌ల‌వుతోంది.

ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో జ‌రిగిన రంగ్ దే ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో క‌ర్నూలుకు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

క‌ర్నూలు ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్ మాట్లాడుతూ, రంగ్ దే ఘ‌న విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు. క‌ర్నూలుకు త‌ర‌చూ వ‌చ్చి సినిమా షూటింగ్స్ చేయాల‌ని నితిన్‌ను కోరారు.

కోడుమూరు ఎమ్మెల్యే సుధాక‌ర్ మాట్లాడుతూ, రంగ్ దే సినిమా పెద్ద హిట్ట‌వ్వాల‌ని, నితిన్‌కు మంచి పేరు రావాల‌ని ఆకాంక్షించారు.

క‌ర్నూలు మునిసిప‌ల్ క‌మిష‌నర్ బాలాజీ మాట్లాడుతూ, తాను ఐఏఎస్‌కు ప్రిపేర‌య్యేట‌ప్పుడు కూడా ప్ర‌తి వారం ఓ సినిమా చూసేవాడిన‌ని తెలిపారు. దిల్ నుంచి నితిన్ సినిమాల‌న్నీ చూశాన‌ని చెప్పారు. రంగ్ దే మూవీ హిట్ట‌వ్వాల‌నే ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు. ఈ సినిమాని ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూస్తామ‌న్నారు.

క‌ర్నూలు ట్రాఫిక్ డీఎస్పీ మెహ‌బూబ్ బాషా సినిమా క‌చ్చితంగా హిట్ట‌వుతుంద‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నారు.

డీజీ భ‌ర‌త్‌, ఎమ్మెల్యేలు హ‌ఫీజ్ ఖాన్‌, సుధాక‌ర్ క‌లిసి రంగ్ దే ట్రైల‌ర్‌ను ఆవిష్క‌రించారు.

డీజీ భ‌ర‌త్ మాట్లాడుతూ, నితిన్ మాకు క‌ర్నూలు బిడ్డ‌. ఆయ‌న బంధువులు మా కొలీగ్‌. ప్ర‌తి మూవీలో నితిన్‌ మ‌రింత యంగ్‌గా త‌యార‌వుతున్నారు. రంగ్ దేలో మ‌రింత యంగ్‌గా క‌నిపిస్తున్నారు. క‌ర్నూలులో షూటింగ్ చేసిన సినిమాల్లో 99 శాతం హిట్‌. రంగ్ దే పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నా.అన్నారు.

నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశి మాట్లాడుతూ, త‌క్కువ స‌మ‌యంలో పిలిచినా వ‌చ్చి ఇంత బాగా ఆద‌రించిన క‌ర్నూలు ప్ర‌జ‌ల‌కు థాంక్స్‌. 26న వ‌స్తున్న సినిమాని కూడా ఇలాగే ఆద‌రించి పెద్ద హిట్ చేయాల‌ని కోరుకుంటున్నా. అన్నారు.

న‌టుడు అభిన‌వ్ గోమ‌టం మాట్లాడుతూ, మా సినిమా రంగ్ దే మార్చి 26న వ‌స్తోంది. ఇదొక ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఒక సంవ‌త్స‌రం క‌ష్ట‌ప‌డి తీశారు. లాక్‌డౌన్ వ‌ల్ల కాస్త ఆల‌స్యం అయ్యింది. సినిమా మ‌స్తుంట‌ది. త‌ప్ప‌కుండా థియేట‌ర్స్‌కు వెళ్లి చూడండి. సాంగ్స్‌లో నితిన్ ఎట్లా డాన్స్ చేస్తారో తెలిసిందే క‌దా. నితిన్‌, సుహాస్‌, వెన్నెల కిశోర్, నేను క‌లిసి మ‌స్తు కామెడీ చేశాం ఈ సినిమాలో..అన్నారు.

నితిన్ మాట్లాడుతూ, ట్రైల‌ర్‌ను లాంచ్ చేసిన హ‌ఫీజ్ ఖాన్‌, సుధాక‌ర్‌, భ‌ర‌త్‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. క‌ర్నూలు రావ‌డం నాకిదే ఫ‌స్ట్ టైమ్‌. క‌ర్నూలు అంటే నాకు గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. అక్క‌డ తీసిన సినిమాలు హిట్ట‌య్యాయి. ఆ ప్లేసెంత ప‌వ‌ర్‌ఫుల్లో మీరింకా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉన్నారు. నేను చాలా ఈవెంట్స్‌కు చాలా ఊళ్ల‌కు వెళ్లాను. అక్క‌డ అంద‌రి ఎన‌ర్జీ చాలా బావుంట‌ది. కానీ మీ ఎన‌ర్జీ దానికంటే ఓ లెవ‌ల్ ఎక్కువ ఉంది. మీ ప్రేమ‌, ఆద‌ర‌ణ చాలా చాలా బావుంది. మార్చి 26 సినిమా వ‌స్తోంది. ప్యూర్ ల‌వ్ స్టోరీ. మామూలుగా రాయ‌ల‌సీమ అంటే ఉట్టి మాస్‌, ఫ్యాక్ష‌న్ అంటారు. కానీ ఆ రెండింటి కంటే కూడా మీలో ల‌వ్ ఎక్కువ ఉంది. అందుకే ఫ‌స్ట్ ఈ ఈవెంట్‌ను ఇక్క‌డ పెట్టాం. ఇదే ప్రేమ‌తో సినిమా చూసి, మాకు హిట్టివ్వండి. అన్నారు.

అంత‌కు ముందు సువ‌ర్ణ అనే అభిమాని నితిన్‌ను పెళ్ల‌య్యాక స‌న్న‌బ‌డ్డారు కార‌ణ‌మేంటి? అన‌డిగితే, ఇంట్లో ప‌నిచేసి, బ‌ట్ట‌లుతికి, అంట్లుతోమి బ‌క్క‌గా అయిపోయాను.అని నితిన్ చ‌మ‌త్క‌రించారు. అలాగే ఆయ‌న అభిమానుల‌తో క‌లిసి సెల్ఫీలు దిగి వారిని ఆనంద‌ప‌రిచారు.

శ్రేయాస్ మీడియా ఆర్గ‌నైజ్ చేసిన ఈ ఈవెంట్‌కు శ్యామ‌ల, భార్గ‌వ్‌ యాంక‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రించారు.

ఆస‌క్తిక‌ర అంశాల‌తో ఆక‌ట్టుకున్న ట్రైల‌ర్‌:

2 నిమిషాల 20 సెక‌న్ల నిడివి ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే, రంగ్ దే మూవీ క‌థ సారాంశం మ‌న‌కు అర్థ‌మైపోతోంది. చ‌క్క‌ని రొమాన్స్‌, కామెడీ క‌ల‌గ‌ల‌సిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీని డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి తీర్చిదిద్దిన‌ట్లు తెలుస్తోంది.

నేను అర్జున్‌.. దేవుడ్ని నాకొక గాళ్‌ఫ్రెండ్‌ని ప్ర‌సాదించ‌మ‌ని కోరుకున్నాను. కోరుకున్న ఆరో సెక‌న్‌కి ఒక పాప మా కాల‌నీకి వ‌చ్చింది. అప్ప‌ట్నుంచి తొక్క‌టం స్టార్ట్ చేసింది.. నా జీవితాన్ని. అని అర్జున్ (నితిన్) చెప్తుండ‌గా ట్రైల‌ర్ స్టార్ట‌యింది. అప్పుడు అర్జున్ బాగా చిన్నోడు. ఆ పాపే పెద్ద‌య్యాక అను (కీర్తి సురేష్‌) అయ్యింది.

మ‌నోడు స్ట‌డీస్‌లో బాగా పూర్ అయితే, అను జీనియ‌స్‌. అర్జున్ ఎగ్జామ్స్‌లో ఫెయిలైతే, అనుకు 95 ప‌ర్సెంట్ మార్క్స్ వ‌స్తాయి. ఆమె వ‌ల్ల ఫ్యామిలీలో అర్జున్‌కు అడుగ‌డుగునా అవ‌మానాలు ఎదుర‌వుతుంటాయి. దాంతో ఫ్ర‌స్ట్రేష‌న్‌కు గురై, అనును ఎలాగైనా వ‌దిలించేసుకోవాల‌ని ట్రై చేస్తుంటాడు. అనుకి మాత్రం అత‌డంటే చాలా ఇష్ట‌మ‌ని ట్రైల‌ర్‌ని బ‌ట్టి ఊహించుకోవ‌చ్చు.

అనుకు క‌డుపు వ‌చ్చింద‌ని, ఈ సంగ‌తి తెలిసి వాళ్ల‌మ్మ అనును చెంప‌మీద ఎడాపెడా వాయించేసిందని అర్థ‌మ‌వుతోంది. ఇంత చేసిందాన్ని ఇంకే ఎద‌వ పెళ్లి చేసుకుంటాడ‌న్న‌య్యా అని అర్జున్ ఫాద‌ర్ ద‌గ్గ‌ర మొర‌పెట్టుకుంది. దాంతో అనుని అర్జున్‌కే ఇచ్చి పెళ్లి చేసేశారు.

కానీ ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ‌లు పెరిగి పెద్ద‌వ‌య్యాయే కానీ, త‌గ్గ‌లేదు. ఇద్ద‌రూ విడిపోయారు. మ‌నం ప్రేమించే వాళ్ల విలువ మ‌నం వాళ్ల‌ను వ‌ద్ద‌నుకున్న‌ప్పుడు కాదు, వాళ్లు మ‌న‌ల్ని అఖ్ఖ‌ర్లేద‌నుకున్న‌ప్పుడు తెలుస్తుంది. అని అర్జున్ మాట‌లు బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుంటే.. కీర్తి విసురుగా న‌డుస్తూ ఏడుస్తుండ‌టం గ‌మ‌నించ‌వ‌చ్చు.

ట్రైల‌ర్ చివ‌ర‌లో "మ‌న అనూకి ఏం త‌క్కువ‌రా?అడిగాడు అర్జున్‌ను వాళ్ల నాన్న‌. అది నాకు న‌చ్చ‌దు నాన్నాఅన్నాడు అర్జున్‌. అదే ఏ..అని రెట్టించాడు నాన్న‌. నీకు ఫిష్ న‌చ్చ‌దు. ఎవ‌ర‌న్నా హార్ట్‌కి మంచిది.. తినండంటే తింటావా? ఇదీ అంతే. అని చెప్పాడు అర్జున్‌.

నాకు ఫిష్ న‌చ్చ‌దు, నేను ముట్టుకోను. నువ్వు ముట్టుకోకుండానే నీ ఫిష్‌కి క‌డుపొచ్చిందా?అని ప్ర‌శ్నించాడు నాన్న‌.

నాన్నా.. ఛీ.. అని త‌ల తిప్పుకున్నాడు అర్జున్‌.

ఇట్లా ఆస‌క్తిక‌ర అంశాల‌తో, ఉత్కంఠ‌ని రేకెత్తించే క‌థ‌నంతో ఈ సినిమా రూపొందింద‌ని తెలిసిపోతోంది. డైలాగ్స్ కూడా ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ అనే విష‌యం ట్రైల‌ర్ తెలియ‌జేస్తోంది. ఇక రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆక‌ట్టుకోగా, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ పి.సి. శ్రీ‌రామ్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాని ఆక‌ర్ష‌ణీయంగా మ‌ల‌చింది.

సెన్సార్ పూర్తి.. యు/ఎ స‌ర్టిఫికెట్‌:

రంగ్ దే సినిమా శుక్ర‌వారం సెన్సార్ ప‌నుల్ని పూర్తి చేసుకొని, యు/ఎ స‌ర్టిఫికెట్ పొందింది. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా న‌వ్విస్తూ, చ‌క్క‌ని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించింద‌ని సెన్సార్ స‌భ్యులు ఈ చిత్రాన్ని కొనియాడారు.

యూత్ స్టార్ నితిన్, కీర్తి సురేష్ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ఈ 

రంగ్ దే.  ప్రతిభగల యువ దర్శకుడు వెంకీ అట్లూరిదర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.

Rang De Is Pure Love Story; Bless Us With A Hit – Hero Nithiin:

Rang De Trailer Launch event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs