Advertisement
Google Ads BL

పద్మశ్రీ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ


పలువురు చిత్రదర్శకుల నడుమ పద్మశ్రీ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ

Advertisement
CJ Advs

వైఫ్ చిత్ర దర్శకులు, రచయిత, నటులు రావిపల్లి  రాంబాబు గారి జన్మదినం సందర్భంగా ఆదివారం సాయంత్రం పద్మశ్రీ చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించింది. ఈ సందర్భంగా రాంబాబు గారు మాట్లాడుతూ తన అభిమాన ఆత్మీయుడు, అయిన ఎస్. ఎస్. పట్నాయక్ చిత్ర దర్శకునిగా మారడమే కాకుండా సొంతంగా ఎస్.ఎస్.పిక్చర్స్ అంటూ ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించడం తనకు ఎంతో ఆనందాన్ని  కలిగించింది  అని.. ఈ సందర్భంగా  పద్మశ్రీ మోషన్ పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు శివ నాగేశ్వర రావు, దేవి ప్రసాద్, వీరశంకర్, మోహన్ గౌడ్, చిత్తరంజన్, వర్ధమాన నటుడు దినేష్ తదితరులు హాజరయ్యారు.  

అందరికీ క్యాచీగా ఉండే పేరు పద్మశ్రీ అని పోస్టర్స్ కూడా ఇన్నోవేటివ్ గా ఉన్నాయని దర్శకులు శివ నాగేశ్వరావు గారు కొనియాడ గా.. అంతా కొత్తవారితో చేసిన ప్రయత్నం సక్సెస్ అయితే ఎంతోమంది నూతన నటీనటులకు సాంకేతిక నిపుణులకు గుర్తింపు అవకాశాలు లభిస్తాయని దర్శకులు దేవి ప్రసాద్ గారు తన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు! అయితే పద్మశ్రీ అనే టైటిల్ తోనే దర్శక నిర్మాతలు  సగం సక్సెస్ సాధించేశారని దర్శకులు వీర శంకర్ గారు కొనియాడారు!

చిత్ర రచయిత, దర్శకుడు ఎస్ఎస్ పట్నాయక్ మాట్లాడుతూ సినిమా ప్రారంభం నుండి ప్రతి విషయానికి ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించకుండా తనపై ఎంతో.. పూర్తి నమ్మకంతో వారి వారి  సహాయ సహకారాలు అందిస్తు.. ఈ కార్యక్రమానికి హాజరైన చిత్ర ఎడిటర్ కంబాల శ్రీనివాస రావు గారికి, కో ప్రొడ్యూసర్స్ మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ గార్లకి తన  కృతజ్ఞతలు తెలియజేశారు!

ఎస్.ఎస్.పిక్చర్స్ బ్యానర్ పై జ్యోతి, రావిపల్లి సంధ్య, కనిక ఖన్నా, రమ్య, కిషోర్, సతీష్, హర్ష, కాళీ చరణ్, చక్రి, ఫన్నీ రాజు, డా. ప్రవీణ్, జయశ్రీ, ఎస్ ఎస్ పట్నాయక్ ఇలా అంతా వర్ధమాన నటీనటులతో చేసిన ఈ యాక్షన్ ఓరియంటెడ్ హారర్ కామెడీ ఫిలిం *పద్మశ్రీ* కి నిర్మాత: సదాశివుని శిరీష, ఛాయాగ్రహణం: మేకల నర్సింగరావు, సంగీతం: జాన్ పోట్ల, ఆర్ట్: మణిపాత్రని, ఫైట్స్: దేవరాజు మాస్టర్, డాన్స్ తారక్, వెంకట్, గ్రాఫిక్స్: డాట్ యానిమేషన్ కంపెనీ. డిజిటల్ పబ్లిసిటీ: బి.ఆర్.కె అడ్వర్టైజింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ Pvt ltd, పి ఆర్ ఓ: సతీష్ పాలకుర్తి, పర్వతనేని రాంబాబు.

Padhma Shri Motion Poster Launch:

<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large XcVN5d tw-ta" dir="ltr"><span lang="en">Padhma Shri Movie Motion Poster Launch</span></pre>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs