Advertisement
Google Ads BL

చమన్ బ్రదర్స్.. సిలకా ఎగిరిపోయావా


విజయ్ దేవరకొండ చేతుల మీదుగా పుష్పక విమానం లోని సిలకా పాట విడుదల

Advertisement
CJ Advs

యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా పుష్పక విమానం.

దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్టార్ హీరో విజయ్

దేవరకొండ సమర్పణలో కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్ మరియు టాంగా

ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి గోవర్ధన్ రావు

దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు గా

వ్యవహరిస్తున్నారు. పుష్పక విమానం మూవీ నుండి మొదటి సాంగ్ ‘‘సిలకా’’

ను ఇవాళ (సోమవారం మార్చి 15) ఉదయం 11.07 నిమిషాలకు స్టార్ హీరో విజయ్

దేవరకొండ రిలీజ్ చేశారు.

సిలకా ఎగిరిపోయావా ఆసలన్ని ఇడిసేసి ఎనకా...సిలకా చిన్నబోయిందె సిట్టి

గుండె పిట్ట నువ్వు లేక  అంటూ సాగే ఈ పాటకు రామ్ మిరియాల సంగీతాన్ని

అందించడంతో పాటు మరో గీత రచయిత ఆనంద్ గుర్రం తో కలిసి సాహిత్యాన్ని

అందించారు. చమన్ బ్రదర్స్ అనే బ్యాండ్ పేరుతో మ్యూజిక్ డైరెక్టర్ రామ్

మిరియాల, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్  పాటలో కనిపిస్తున్నారు. వాళ్లు

పాడుతూ డాన్సులు చేస్తూ పాటకు జోష్ తీసుకొచ్చారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశలో ఉన్న పుష్పక

విమానం సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. *

ఆనంద్ దేవరకొండ, గీత్ సైని, శాన్వి మేఘన, సునీల్, నరేష్, హర్షవర్థన్,

గిరిధర్, కిరీటి, భద్రం, వైవా హర్ష, అభిజిత్, అజయ్, సుదర్శన్, శరణ్య,

మీనా వాసు,షేకింగ్ శేషు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి

సమర్పణ : విజయ్ దేవరకొండ, రచన-దర్శకత్వం: దామోదర

First song Silakaa from Pushpaka Vimanam is released:

Pushpaka Vimanam First song Silakaa released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs