Advertisement
Google Ads BL

అన్ని సినిమాలు చేసి కూడా ఇలా కనిపిస్తున్న ఆమని.!


చావు కబురు చల్లగా సినిమాలో వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తున్న సీనియర్ నటి ఆమని..

Advertisement
CJ Advs

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ విజయాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం చావు క‌బురు చ‌ల్ల‌గా. ‌ మార్చ్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అదిరిపోయే కామెడీ సీన్స్.. అద్భుతమైన ఎమోషన్.. మంచి కథతో అన్ని కమర్షియల్ హంగులు అద్దుకున్న ట్రైలర్ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. బ‌స్తి బాల‌రాజు గా హీరో కార్తికేయ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈయన ఫ‌స్ట్ లుక్, ఇంట్రోతో పాటు క్యారెక్ట‌ర్ వీడియోకు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి కూడా మంచి అప్లాజ్ వచ్చింది. తాజాగా సీనియర్ నటి ఆమని గారి లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. 90ల్లో మావిచిగురు, శుభలగ్నం లాంటి హోమ్లీ కారెక్టర్స్‌తో అలరించిన ఆమని.. చావు కబురు చల్లగా సినిమాలో వైవిధ్యమైన పాత్రతో మెప్పించడానికి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చేతిలో మద్యం సీసా.. వంట చేస్తూ విడుదలైన ఈమె ఫస్ట్ లుక్‌కు విశేషమైన స్పందన వస్తుంది. 

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి మాట్లాడుతూ ఇప్ప‌టికే చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రం నుంచి విడుద‌ల చేసిన ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య స్పంద‌న వస్తుంది. మాస్ అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇందులో సీనియర్ నటీనటులు అంతా చక్కగా నటించారు.. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వాళ్లు విడుద‌ల చేస్తున్నారు.

నటీనటులు: కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని,ముర‌ళి శ‌ర్మ‌, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు త‌దితరులు

సాంకేతిక వ‌ర్గం: స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్, బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్, నిర్మాత - బ‌న్నీ వాసు, దర్శకుడు - కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి, ఎడిట‌ర్‌- స‌త్య జి, ఆర్ట్‌ - జి ఎమ్ శేఖ‌ర్‌, మ్యూజిక్ - జేక్స్‌ బిజాయ్, సినిమాటోగ్రాఫ‌ర్ - క‌ర‌మ్ ఛావ్లా, అడిషిన‌ల్ డైలాగ్స్ - శివ కుమార్ భూజుల‌, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్ - రాఘ‌వ క‌రుటూరి, శ‌ర‌త్ చంద్ర నాయిడు, పి ఆర్ ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్, లిరిక‌ల్ వీడియోస్ - క్రేజీ షౌట్, ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ - మ‌నిషా ఏ ద‌త్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్ - మౌనా గుమ్మ‌డి.

Aamani is who appears in a different role in the movie Chavu Kaburu Challaga.:

<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large XcVN5d tw-ta" dir="ltr"><span lang="en">Aamani is who appears in a different role in the movie Chavu Kaburu Challaga.</span></pre>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs