Advertisement
Google Ads BL

మహా శివరాత్రి శుభాకాంక్షలతో తొలి ఏకాదశి


సంధ్య స్టూడియోస్ పతాకంపై యువ ప్రతిభాశాలి సందీప్ మద్దూరు(దీపు) దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత రవి కనగాల నిర్మిస్తున్న చిత్రం తొలి ఏకాదశి.

Advertisement
CJ Advs

సుమిత్ రాయ్, సాయి నివాస్, సాయి రాజ్, మమతా నారాయణ్, వాణి, సాహితి దాసరి, నాగమణి ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రం మహాశివరాత్రి పర్వదినాన సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. 

సి.కళ్యాణ్ మాట్లాడుతూ..తొలి ఏకాదశి అనే పేరును బట్టి ఇదొక భక్తి చిత్రం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. తొలి ఏకాదశి రోజు జరిగే అనూహ్య సంఘటనల సమాహారంగా సందీప్ మద్దూరు (దీపు) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తన టాలెంట్ నిరూపించుకుని, ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్న సందీప్.. వెండి తెరపై కూడా అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

జబర్దస్త్ అప్పారావు, లక్ష్మీకుమార్, గిరిధర్, సూర్య కిరణ్,  సంపత్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పోరాటాలు: దేవివరప్రసాద్, కూర్పు: కాగడా మధు, ఛాయాగ్రహణం: సుధాకర్ అక్కినపల్లి, నిర్వహణ: గిరిధర్ శ్రీరామగిరి, నిర్మాత: రవి కనగాల, రచన-దర్శకత్వం: సందీప్ మద్దూరు(దీపు)!!

Tholi Ekadasi Opening:

Toli Ekadasi Opening news
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs