Advertisement
Google Ads BL

ఏక్ మినీ కథ టీజ‌ర్


యు వి క్రియేష‌న్స్ అంటే ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా క్వాలిటి ఆఫ్ మూవీస్ నిర్మించే నిర్మాణ సంస్థ‌. మిర్చి నుండి ఇప్ప‌డు రాధేశ్యామ్ వ‌ర‌కూ ద‌ర్శ‌కుడి క‌థ‌ని న‌మ్మి మార్కెట్ కి ఏమాత్ర సంబందం లేకుండా గ్రాండియర్ గా సినిమాలు తెర‌కెక్కించారు. యు వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో చిత్రం వ‌స్తుందంటే మంచి చిత్రాలు చూస్తామ‌నే బ‌రోసా ప్రేక్ష‌కుల‌ల్లో వుంది. ఇప్ప‌డు వారంద‌రి న‌మ్మ‌కాన్ని మ‌రింత బ‌ల‌ప‌రుస్తూ యు వి క్రియోష‌న్స్ బ్యాన‌ర్ కి అనుభంద సంస్థ గా యు వి కాన్సెప్ట్స్ బ్యాన‌ర్ ని స్థాపించి ప్రేక్ష‌కుడి వినోదాన్ని డబుల్ చేస్తున్నారు. ఈ బ్యాన‌ర్ లో మొద‌టి చిత్రం గా ఏక్ మిని క‌థ ని తెర‌కెక్కించారు. మిర్చి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌రువాత సుజిత్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ర‌న్ రాజా ర‌న్ , రాధాకృష్ణ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ జిల్ లాంటి చిత్రాలు నిర్మించి సూప‌ర్ హిట్స్ అందించిన నిర్మాణ సంస్థ యు వి క్రియేష‌న్స్‌. ఇప్ప‌డు ఏక్ మిని క‌థ చిత్రం తో కార్తీక్ రాపోలు ద‌ర్శ‌కుడు గా ప‌రిచ‌యం అవుతున్నారు.  ఏక్ మినీ కథ చిత్ర ఫస్ట్ లుక్ చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  Does Size Matter అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్ప‌డు ఏక్ మిని క‌థ టీజ‌ర్ కూడా కామ‌న్ ఆడియ‌న్స్ అండ్ సోష‌ల్ మీడియా పీపుల్ ని బాగా ఆక‌ట్టుకుంది. 

Advertisement
CJ Advs

టీజ‌ర్ లో టైమింగ్ తో ఆక‌ట్టుకున్న‌సంతోష్ శోభ‌న్‌

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శోభ‌న్ గారి కుమారుడిగా పేప‌ర్ బాయ్ చిత్రం తో తెలుగు తెర‌కి ప‌రిచ‌యమ‌య్యి మంచి న‌టుడి గా ప్రేక్ష‌కుడి చేత మంచి మార్క్ లు వేయించుకున్నాడు. ఇప్ప‌డు ఏక్ మిని క‌థ చిత్రం లో చాలా ఢిఫ‌రెంట్ క‌థ తో ప్రేక్ష‌కుడ్ని న‌వ్విండానికి సిధ్ధ‌మ‌య్యాడనే విష‌యం టీజ‌ర్ చూసిన అంద‌రికి అర్ధం అవుతుంది. అది చిన్న‌దైతే మాత్రం ప్రాబ్లం పెద్ద‌దే బ్రో అనే డైలాగ్ ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టు‌కున్నారు. 

మేర్ల‌పాక గాంధి-యువి కాంబినేష‌న్‌

ఎక్స్‌ప్రేస్ రాజా చిత్రం తో యు వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లొ స‌క్స‌స్ ని సాధించిన ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధి ఈ చిత్రానికి క‌థ‌ని అందించారు. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌,ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్దం లాంటి చిత్రాల‌తో టాలీవుడ్ లో దూసుకుపోతున్న మేర్ల‌పాక గాంధి ఇప్పుడు ఈ ఏక్ మిని క‌థ కి క‌థ‌, ర‌చ‌న ఇవ్వ‌ట‌మే కాకుండా ద‌ర్శ‌కుడు కార్తీక్ రాపోలు కి త‌న స‌పోర్ట్ ని అందించడం విశేషం.

పేప‌ర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈయన లుక్ కు మంచి స్పందన వస్తుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్  రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

Click Here to: Ek Mini Katha Teaser

Ek Mini Katha Teaser:

Ek Mini Katha Teaser News
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs