తెలంగాణ రాష్ట్రం మరో ఉద్యమ వీరుడిని కోల్పోయింది. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన డాక్టర్ చిరంజీవి కొల్లూరి (74)కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో గచ్చిబౌలి AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన రాత్రి 1:30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య డాక్టర్ చంద్ర, కూతురు అజిత ఉన్నారు. అనారోగ్యం పాలైన చిరంజీవి, అయన కుటుంబం హాస్పిటల్ ఖర్చులు భరించలేని స్థితిలో ఉందని తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం అత్యవసర నిధి నుంచి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్వయంగా హాస్పిటల్ వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసి రాష్ట్ర ప్రభుత్వ సహాయాన్ని అందజేశారు. డాక్టర్ చిరంజీవి ని రక్షించడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
1947 ఫిబ్రవరి లో చిరంజీవి వరంగల్ లో జన్మించారు. తల్లి టీచర్, తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. కాకతీయ మెడికల్ కాలేజీలో MBBS చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి సంఘం నేతగా చురుకుగా పని చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా కీలకపాత్ర పోషించారు.
నాలుగు ఉద్యమాల లో కీలక నేతగా ఉండి తనకంటూ ఏమీ సంపాదించుకోకుండా తుది శ్వాస వరకు పేదల కోసం పరితపించిన డాక్టర్ చిరంజీవి కొల్లూరి నికార్సయిన తెలంగాణ నేత. అందరికి ఆదర్శవంతుడు.
అలాంటి నేత మన మధ్య లేకపోవడం నిజంగా విషాదకరం తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు డాక్టర్ చిరంజీవి కొల్లూరి చిరంజీవి నే