Advertisement
Google Ads BL

బంపర్ ఆఫర్ నే నమ్ముకున్న సాయిరాం


*ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలిపిన డేరింగ్ అండ్ డాషింగ్  దర్శకుడు పూరి జగన్నాథ్ 

Advertisement
CJ Advs

* రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించనున్న దర్శకుడు జయ రవీంద్ర

*ఉగాది శుభాకాంక్షలతో చిత్రం షూటింగ్ ప్రారంభం

* సురేష్ విజయ ప్రొడక్షన్స్, సినిమాస్ దుకాన్ సంస్థలు సంయుక్త నిర్మాణం

ఓ చిత్రం విజయం సాధిస్తే దానికి సీక్వెల్ చేయటం ఓ పద్ధతి. అదే చిత్రం పేరును కొనసాగిస్తూ కొత్త కథను తెరకెక్కించడం మరో పద్ధతి. ఇప్పుడీ రెండో పద్దతిలోనే ఓ చిత్రం ఈరోజు పురుడు పోసుకుంది. 

యువ హీరో సాయిరాం శంకర్  హీరోగా గతంలో రూపొందిన బంపర్ ఆఫర్ చిత్రం, సాధించిన విజయం ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది. ఇప్పుడు ఆయనే హీరోగా అదే పేరును కొనసాగిస్తూ బంపర్ ఆఫర్ - 2 పేరుతో ఓ చిత్రం నిర్మితం కానుంది. వివరాల్లోకి వెళితే....

తెలుగు చలన చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రముఖ స్థానాన్ని ఏర్పరుచుకున్న డేరింగ్ అండ్ డాషింగ్  దర్శకుడు పూరి జగన్నాథ్  గారి ఆశీర్వాదం తో, సురేష్ విజయ ప్రొడక్షన్స్ మరియు సినిమాస్ దుకాన్ సంయుక్త నిర్మాణంలో సాయిరాం శంకర్ హీరోగా సురేష్ యల్లంరాజు, సాయి రామ్ శంకర్ లు నిర్మాతలుగా బంపర్ ఆఫర్ 2 చిత్రాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు.

బంపర్ ఆఫర్ విజయం నేపథ్యంలో పన్నెండు సంవత్సరాల తర్వాత అదే పేరు మీద రెండవ భాగం చేస్తున్నారు. అయితే ఇది సీక్వెల్ కాదు, రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించబోతున్నారు. బంపర్ ఆఫర్ చిత్రానికి దర్శకత్వం వహించిన జయ రవీంద్ర ఈ రెండో భాగాని కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి అశోక స్క్రిప్ట్ రచన చేశారు.  ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ఉగాది శుభాకాంక్షలతో ఏప్రిల్ నెలలో ప్రారంభం అవుతుంది. చిత్రం లోని హీరోయిన్స్ మరియు ఇతర తారాగణం,సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సురేష్ యల్లంరాజు.

ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చుతుండగా, పప్పు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు,ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు మరియు ఆర్ట్ డైరెక్టర్ గా వర్మ  ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక నిపుణులు

Sai Raam Shankar Bumper Offer 2 Announced :

With the blessings of Puri Jagannadh, Sai Raam Shankar Bumper Offer 2 Announced 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs