Advertisement
Google Ads BL

మొనగాడు ట్రైలర్ మైండ్ బ్లోయింగ్


మొనగాడు ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది- ప్రముఖ దర్శకుడు వీరశంకర్!

Advertisement
CJ Advs

నూతన నటుడు వంశీ ఆకుల హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మొనగాడు. పావని హీరోయిన్ గా నటించింది. కీలు గుర్రం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పక్కా విలేజ్ బాక్డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వంశీ ఆకుల ఈ చిత్రాన్ని నిర్మించారు. ర్యాప్ రాక్ షకీల్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ట్రైలర్ మరియు సాంగ్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వీర శంకర్, గంధర్వ టీమ్ అప్సర్, మధు నారాయణ్, అక్షత శ్రీనివాస్, సంగీత దర్శకుడు రాప్ రాక్ షకీల్, ఇండియన్ ఐడల్ సింగర్ శ్రీరామచంద్ర, పాటల రచయిత మెట్టపల్లి సురేంద్ర, డివోపి ఉదయ్, హీరో వంశీ ఆకుల, నటుడు సమీర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ.. మంచి కాన్సెప్టెడ్ ఫిలిమ్స్ ఎప్పుడు వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. మొనగాడు టైటిల్ తో పాటు పోస్టర్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. వంశీ లుక్స్ ఎక్స్ ప్రెసివ్ ఐస్ స్ట్రైకింగ్ గా ఉన్నాయి. ట్రైలర్ చూడగానే మైండ్ బ్లాక్ అయింది. రస్టిక్ ఫిల్మ్ ని కసితో ఫీల్ మిస్ అవకుండా పర్ఫెక్ట్ ఎనర్జిటిక్ గా చేసాడు.. వంశీ. అప్పట్లో చిరంజీవి గారు ఎంత కాన్ఫిడెంట్ గా కసితో చేసేవారో ఇప్పుడు వంశీ మొనగాడు లో చేశాడు. వంశీ రేసుగుర్రంలా పరుగెత్తి మరిన్ని మంచి సినిమాలు చేయాలి.. ఇండస్ట్రీలో వెర్సటైల్ ఆర్టిస్ట్ గా పేరుతెచ్చుకోవాలి. మొనగాడు సూపర్ హిట్ అవ్వాలి అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని పాటలన్ని విజువల్స్ షూట్ చేశాక వంశీ దానికి తగ్గట్లు ట్యూన్స్ కంపోజ్ చేయమన్నాడు. ఇదొక కొత్త ఎక్స్ పీరియెన్స్. పాటలన్నీ బిగ్ అవుతాయి. అంత అద్భుతంగా వచ్చాయి. మెట్టపల్లి సురేంద్ర అత్యద్భుతంగా లిరిక్స్ రాశారు. శ్రీరామచంద్ర మల్లీ మల్లి సాంగ్ పాడారు. మంచి క్వాలిటీ ఫియమ్ ఇది. ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా మొనగాడు చిత్రం ఉంటుంది అన్నారు.

గంధర్వ చిత్ర దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ.. మౌత్ టాక్ స్ప్రెడ్ అయి హిట్ అయ్యే సినిమాలు కొన్ని ఉంటాయి.. ఆకోవలో  మొనగాడు చిత్రం మౌత్ టాక్ స్ప్రెడ్ అయి హిట్ అయ్యే సినిమా. ప్రతీ ఒక్కరూ ఈ సినిమా చూసి మొనగాడు చాలబాగుంది అని.. ఒకరికొకరు మెసేజ్ లు చేసుకుంటారు. వంశీ ఆకుల హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎంతో కష్టపడి బ్యూటిఫుల్ చిత్రం చేశాడు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

హీరోయిన్ అక్షత శ్రీనివాసన్ మాట్లాడుతూ.. మొనగాడు ట్రైలర్ చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. రాకంటెంట్ తో రియలిస్టిక్ పెర్ఫార్మన్స్ తో ఈ సినిమాలో నటించారు వంశీ. తప్పకుండా మంచి సక్సెస్ అవుతుంది అన్నారు.

ఇండియన్ ఐడల్ సింగర్ శ్రీరామచంద్ర మాట్లాడుతూ.. ఈ చిత్రంలో మల్లి మల్లి పాట బాగా ఫీల్ అయి పాడాను. సురేంద్ర బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. రాప్ రాక్ షకీల్ సూపర్బ్ ట్యూన్స్ కంపోజ్ చేశాడు. ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమాతో వంశీ సక్సెస్ అవ్వాలి అన్నారు.

హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ వంశీ ఆకుల మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను. ఒక మెస్ లో పనిచేస్తూ.. చాలా కష్టాలు పడ్డాను.. అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నించాను.. ఆఫీస్ అడ్రెస్ లు తెలియక ఛాన్స్ లు రాలేదు. తిరిగి మా ఊరు వెళ్ళిపోయాను. అప్పటినుండి ఒక మంచి సినిమా చేయాలని నా కోరిక. నాకు బ్యాక్ గ్రౌండ్ అంటూ ఏమీలేదు. నా బ్యాక్ గ్రౌండ్ అంటూ ఎవరన్నా ఉన్నారంటే అది నా కులదైవం వేంకటేశ్వరస్వామి నే. అందుకే మంచి కథతో నేనే హీరోగా నటిస్తూ.. దర్శకత్వం చేసి ప్రొడ్యూస్ చేశాను. ఈ సినిమాకి మా టీమ్ అందరూ డైరెక్టర్లే.. నా వక్కడివాల్ల ఈ సినిమా అయ్యేది కాదు. నాకు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ సహకరించి సపోర్ట్ చేశారు. మొనగాడు సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.. ఆడియెన్స్ అందర్నీ శాటిస్ పై చేస్తుంది అన్నారు.

వంశీ ఆకుల, పావని నటించిన ఈ చిత్రంలో దేవ్ గిల్, ఛత్రపతి శేఖర్, సమీర్, రాజ్ కుమార్ , సుజాత, జయరాం, రాజీవ్ సింగ్ తదితరులు నటించిన..

ఈ చిత్రానికి డివోపి; ఉదయ్ జె. భాస్కర్, స్టంట్స్; దేవ్ రాజ్, సంగీతం; ర్యాప్ రాక్ షకీల్, ఎడిటర్; నాగేశ్వర్ రెడ్డి బొంతల, ఆర్ట్ డైరెక్టర్; గిరి, కో- డైరెక్టర్; ప్రకాష్ నీలం, పీఆర్ఓ; సాయి సతీష్, పర్వతనేని రాంబాబు, హీరో- కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం-నిర్మాత- వంశీ ఆకుల.

Monagadu Trailer Mind Blowing:

Monagadu Movie Trailer Launch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs