Advertisement
Google Ads BL

కొవిడ్ వారియర్ అవార్డు గెల్చుకున్న నటి అలేఖ్య ఏంజల్ కొండపల్లి.!


కొవిడ్ వారియర్ రియల్ హీరో 2021 అవార్డు గెల్చుకున్న నటి అలేఖ్య ఏంజల్ కొండపల్లి..!

Advertisement
CJ Advs

కరోనా మహమ్మారితో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికి తెలిసిందే. ప్రపంచంలో ఎప్పుడు ఎరుగని విధంగా లాక్ డౌన్ విధించి పరోక్షంగా ప్రజల కన్నీళ్లకు కారణమైంది కరోనా..చిత్ర పరిశ్రమలో ఈ తరహా కష్టాలు ఇంకా ఎక్కువ అయ్యాయి..పనిచేస్తే కానీ రోజు గడవని ప్రతిఒక్కరు ఈ మహమ్మారి వల్ల ఇబ్బంది పడ్డవారే.. అలాంటి వారిని తన శక్తి మేరకు ఆదుకుని వారికి చేయూతనిచ్చింది అలేఖ్య కొండపల్లి. ప్రతి రోజు పండగే, అక్కడొకడున్నాడు, మిస్టర్ మనీ, ఆనందం మళ్ళీ మొదలైంది, ఆ ఐదుగురు వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అలేఖ్య తెలుగు సినిమా రంగంలోని వివిధ శాఖల వారికి పెద్దమనసు తో తనవంతు సాయం చేసింది. నిత్యావసర వస్తువులను అందించి ఎంతోమంది ఆకలిని తీర్చింది. లాక్ డౌన్ టైం లో తాను చేసిన సేవలకు గానూ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ సంస్థ వారు కొవిడ్ వారియర్ రియల్ హీరో 2021 అవార్డు ను అందజేశారు. 

ఈ సందర్భంగా అలేఖ్య కొండపల్లి మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశ్యంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి ఇంత గొప్ప అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంది. లాక్ డౌన్ వల్ల ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. అందులో నాకు తోచినంత, శక్తిమేర సహాయం చేశాను. ఎంత ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ సంస్థ నా సేవలను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం గొప్పగా ఉంది.. నా శక్తిమేర ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను అని చెప్పారు.

Honored to receive award from Dadasaheb Phalke Institute Alekhya Angel kondapalli:

<span>Honored to receive award from Dadasaheb Phalke Institute Alekhya Angel kondapalli</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs