Advertisement
Google Ads BL

మెగాస్టార్ చేతుల మీదుగా మోసగాళ్ళు ట్రైలర్


డీ, దూసుకెళ్తా, దేనికైనా రెడీ వంటి హిట్ చిత్రాల్లో నటించిన వెర్సటైల్ యాక్టర్ మంచు విష్ణు తాజాగా ఆయన నటిస్తూ నిర్మించిన చిత్రం మోసగాళ్ళు. ఏవిఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రెమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ కాజల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రదారులుగా నటించిన ఈ చిత్రాన్ని విష్ణు మంచు అత్యంత భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో మోసగాళ్ళు చిత్రాన్ని నిర్మించారు. రియల్ ఇన్సిడెంట్స్ తో ప్రపంచంలో జరిగిన బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి ఫిబ్రవరి 25న రిలీజ్ చేశారు.. ఈ సందర్బంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రంలో హీరో విష్ణు మంచు పాల్గొన్నారు..

Advertisement
CJ Advs

హీరో, నిర్మాత విష్ణు మంచు మాట్లాడుతూ... 2015లో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి ముంబయి, గుజరాత్ లలో ఉండి ఒక సింపుల్ ఐడీయాతో అమెరికా డబ్బుని 4వేల కోట్ల స్కామ్ చేశారు. అది ఎలా చేశారు. ఆ డబ్బు ఎక్కడుంది.. ఇంతకీ వాళ్ళు దొరికారా? లేదా?అనే ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ తో ఈ చిత్రాన్ని చేశాం. యు యస్ లో ఉండి ఈ కథని డెవలప్ చేశాం. అమెరికాలో నిజంగా జరిగిన కథ ఇది. ఈ స్కామ్ వల్ల అక్కడ  కొన్ని వేల కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి. మూడు సంవత్సరాలు మోసగాళ్ళు కథపై వర్క్ చేశాం. హాలీవుడ్ స్థాయికి ధీటుగా  జెఫ్రీ ఈ చిత్రాన్ని ఫెంటాస్టిక్ గా తెరకెక్కించాడు. కథ నచ్చి కాజల్ ఈ సినిమాని ఎంతో స్పోర్టివ్ గా తీసుకొని చేసింది. నిజంగా చెప్పాలంటే ఈ చిత్రంలో కాజల్ హీరో.. మెయిన్ లీడ్ పాత్రలో నటించింది. అలాగే సునీల్ శెట్టి గారు పోలీస్ క్యారెక్టర్ చేశారు. అలాగే నవదీప్, నవీన్ చంద్ర, వై వ హర్ష టెరిఫిక్ క్యారెక్టర్స్ చేశారు. డైమండ్ రత్నబాబు, గౌతమ్ రాజు గారు చాలా హెల్ప్ చేశారు. ఫస్ట్ కాపీ చూశాక చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. చాలా నెర్వస్ గా కూడా వుంది.  సినిమా చూసిన వారంతా చాలా బాగుంది అని అప్రిషియేట్ చేశారు. ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. అడిగిన వెంటనే మా చిత్రం ట్రైలర్ ని రిలీజ్ చేసిన చిరంజీవి గారికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాకి వాయిస్ ఓవర్ వెంకటేష్ గారు చెప్పారు.. ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు.. అన్నారు.

Megastar Chiru Launches Mosagallu Trailer :

<h3 class="text-center"><span>Mosagallu Trailer review</span></h3>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs