Advertisement
Google Ads BL

రంగ్ దే పబ్లిసిటీ షురూ


విడుదలకు రంగులద్దుకుంటున్న రంగ్ దే

Advertisement
CJ Advs

* యూత్ స్టార్ నితిన్, కీర్తి సురేష్ ల రంగ్ దే చిత్రం మార్చి 26న విడుదల 

* రంగ్ దే ప్రచార సంబరాలు షురూ...!

యూత్ స్టార్ నితిన్, కీర్తి సురేష్ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్నిర్మిస్తున్న చిత్రం ఈ రంగ్ దే. ప్రతిభగల యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. గత నాలుగు రోజులుగా చిత్రంలోని ఓ గీతానికి  సంభందించిన దృశ్యాలు చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తి చేసుకున్నది ఈ చిత్రం.  ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి  2021 మార్చి 26న ధియేటర్ లలో రంగ్ దే సంబరాలు షురూ అవుతాయని తెలిపారు. సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దీనికి రూపకల్పన చేశారు దర్శకుడు వెంకీ అట్లూరి.యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుంది. ఇటీవల రంగ్ దే చిత్రం నుంచి విడుదల అయిన దృశ్యాలతో కూడిన వీడియో, అలాగే ఓ గీతం బహుళ ప్రేక్షకాదరణ పొందిన విషయం విదితమే. 

 ప్రేమతో కూడిన కుటుంబ కధా చిత్రం ఈ  రంగ్ దే. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా  ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 

నితిన్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ రంగ్ దే చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి  డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  ఎస్.వెంకటరత్నం(వెంకట్)

Rang De Publicity Start:

The promotion festivities for Rang De have been kicked off
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs