Advertisement
Google Ads BL

హాఫ్ స్టోరీస్ మోషన్ పోస్టర్ విడుదల!


డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా హాఫ్ స్టోరీస్ మోషన్ పోస్టర్ విడుదల

Advertisement
CJ Advs

రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందుమౌళి, కంచరపాలెం రాజు ప్రధాన పాత్రల్లో.. బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై శివ వరప్రసాద్ కె.దర్శకత్వంలో.. యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం హాఫ్ స్టోరీస్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు మారుతి చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో బేబీ లాలిత్య, నిర్మాత సుధాకర్ రెడ్డి, దర్శకుడు శివ వరప్రసాద్ కె, హీరో రాజీవ్ పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి.. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. 

మోషన్ పోస్టర్ విడుదల అనంతరం డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌లో వస్తోన్న హాఫ్ స్టోరీస్ చిత్ర గ్లింప్స్ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. అంథాలజీ బేస్డ్ కాన్సెప్ట్ ఇది. అంథాలజీ కాన్సెప్ట్ అంటేనే మంచి హిట్ కాన్సెప్ట్. ఆ జానర్‌లో వచ్చే సినిమాలన్నీ చాలా బాగుంటాయి. ఒకే టోన్‌లో ఐదు రకాల కథలు చెప్పడం సామాన్యమైన విషయం కాదు. ఈ కాన్సెప్ట్‌తో సినిమా చేసిన నిర్మాత సుధాకర్ రెడ్డిగారిని ముందుగా అభినందిస్తున్నాను. డైరెక్టర్ శివ ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించాడనేది ఈ వీడియో చూస్తుంటే తెలుస్తుంది. ఇందులో హీరో రాజీవ్ పాత్ర సినిమాకి ప్లస్ అవుతుంది. అలాగే ఇందులో కోటీగారు యాక్ట్ చేశారు. ఆయన పాత్ర ఈ సినిమాకి ఎస్సెట్ అవుతుందని అనుకుంటున్నాను. ఆయన లుక్ కూడా చాలా బాగుంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి, పెద్ద సక్సెస్ చేసి.. మళ్లీ ఇలాంటి మంచి మంచి సినిమాలు వీరి నుంచి వచ్చేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్.. అని అన్నారు. మోషన్ పోస్టర్ విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపిన మారుతికి చిత్రయూనిట్ ధన్యవాదాలు తెలిపింది.

ఈ చిత్రానికి సంగీతం: కోటి, డివోపి: చైతన్య కందుల, ఎడిటర్: సెల్వకుమార్, నిర్మాత: యం. సుధాకర్ రెడ్డి, దర్శకత్వం: శివ వరప్రసాద్ కె.

Half Stories Motion Poster Released:

<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large XcVN5d tw-ta" dir="ltr"><span lang="en">Half Stories movie Motion Poster Released</span></pre>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs