Advertisement
Google Ads BL

జెమినీ వారి కొత్త చిత్రం!


అనురాగ్ కొణిదెన, అవికా గోర్ జంటగా నూతన చిత్రం ప్రారంభం!

అనురాగ్ కొణిదెన హీరోగా అవికా గోర్ హీరోయిన్ గా జెమిని ఎఫ్ ఎక్స్  సమర్పణలో అవికా స్క్రీన్ క్రియేషన్స్ లిమిటెడ్, క్రిషి క్రియేషన్స్  పతాకంపై సత్యం ద్వారపూడి దర్శకత్వంలో కోటేశ్వరరావు కె. ప్రొడక్షన్ నెంబర్ వన్ గా  రూపొందిస్తున్న చిత్రం ఫిబ్రవరి 17న హైదరాబాద్ ఫిలిం నగర్ దైవసన్నిధానంలో ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ నివ్వగా నాంధి ప్రొడ్యూసర్ సతీష్ వేగేశ్న కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సన్నివేశానికి సీనియర్ దర్శకుడు అజయ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో హీరో అనురాగ్, హీరోయిన్ అవికా గోర్, జెమిని ప్రతినిధి మూర్తి, దర్శకుడు సత్యం, సంగీత దర్శకుడు శక్తి కాంత్ పాల్గొన్నారు..

ఆనంద్ సినీ సర్వీస్, జెమిని లాబ్స్, ఫిలిం సర్క్యూట్స్ సంస్థ CEO పీవీఆర్ మూర్తి మాట్లాడుతూ.. అక్కినేని ఎల్వి ప్రసాద్ గారు మనవళ్లు అయినటువంటి మనోహర్ ప్రసాద్ గారు మరియు లేట్ శ్రీ రవి శంకర్ ప్రసాద్ గారు మరియు జెమిని లాబ్స్, జెమిని ఫిలిం సర్క్యూట్స్, ఆనంద్ సినీ సర్వీసెస్, జయభేరి ఆర్ట్స్, 70 సంవత్సరాలుగా సౌత్ ఇండియాలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి, ఎన్నో సేవలు అందించారు. చిరంజీవి, నాగార్జున పిలుపు మేరకు.. ఇండస్ట్రీకి కొత్తనీరు రావాలి.. ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందర్నీ ఎంకరేజ్ చేసి ప్రోత్సహించాలి అని ఒక వేదిక మీద సూచించారు. అదే స్పూర్తితో వారి కోరిక మేరకు మా జెమిని సంస్థ ద్వారా ప్రతిభ వున్న నటీ నటులను, టెక్నీషియన్స్, నిర్మాతలను ప్రోత్సహించాలని మనోహర్ ప్రసాద్ గారు అవకాశం కల్పిస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలను నిర్మించాలని నిర్ణయించుకున్నాం. తొలిప్రయత్నంగా తమిళ్, కన్నడలో సూపర్ హిట్ అయిన ఓ సినిమా ఆధారంగా అనురాగ్, అవికా కాంబినేషన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మార్చ్ 4నాలుగు నుండి ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ జూన్ 7నుండి సెకండ్ షెడ్యూల్ చేస్తాం. మళ్ళీ జూన్ 7 నుండి సెకండ్ షెడ్యూల్ చేస్తాము. దీంతో షూటింగ్ అంతా పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగష్ట్ లో సినిమా రిలీజ్ చేస్తాం.. అన్నారు.

హీరోయిన్ అవికా గోర్ మాట్లాడుతూ.. టీవీ సీరియల్స్, సినిమాల్లో ఎన్నో రకాల పత్రాలు పోషించాను. తెలుగు  ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించారు. మంచి కంటెంట్ వున్న సినిమాలు, న్యూ జోనర్ ఫిలిమ్స్ తీయాలని ఓన్ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేశాను. అవికా స్క్రీన్ బ్యానర్లో న్యూ టాలెంట్ వున్న దర్శకులను, హీరో, హీరోయిన్స్ కి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలని నా కోరిక. ఎప్పటినుండో  ఇది  నా డ్రీమ్. ఇప్పటికి నా కల నెరవేరినందుకు చాలా హ్యాపీగా వుంది. ఈ చిత్రంలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. వెరీ స్పెషల్ స్టోరీ. లవ్, కామిడీ, అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన టీం అందరికి చాల థాంక్స్. ఇట్స్ ఎ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ మూవీ. బ్రిలియంట్ టీమ్ తో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది.. అన్నారు.  

హీరో అనురాగ్ కొణిదెన మాట్లాడుతూ.. జెమినీ లాంటి పెద్ద బ్యానర్ లో నాకు అవకాశం ఇచ్చిన జెమినీ సంస్థవారికి, మా డైరెక్టర్ సత్యంకు చాలా థాంక్స్. పీవీఆర్ మూర్తి గారు మాకు బ్యాక్ బోన్ గా వుండి ఈ ప్రాజెక్ట్ కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరం కష్టపడి ఒక సూపర్ హిట్ సినిమా చేస్తామని గట్టిగా నమ్ముతున్నాను.. అన్నారు.

దర్శకుడు సత్యం ద్వారపూడి మాట్లాడుతూ.. జెమినీ మనోహర్ ప్రసాద్ గారి ఆశీర్వాదంతో పీవీఆర్ మూర్తి గారి సపోర్ట్, ఎంకరేజ్ మెంట్ తో ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశాం. అనురాగ్, అవికా గోర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని  ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాం. ఆల్ రెడీ ఇది తమిళ్లో సూపర్ హిట్ అయిన సినిమా. శక్తికాంత్ మ్యూజిక్, రఘు కెమెరా అందిస్తున్నారు. నాకు ఇంతమంచి అవకాశం కల్పించిన జెమినీ సంస్థకు జీవితాంతం రుణపడి వుంటాను. అలాగే నన్ను నమ్మి ప్రోత్సహిస్తున్న పీవీఆర్ మూర్తిగారికి నా ధన్యవాదాలు.. అన్నారు.

సంగీత దర్శకుడు శక్తికాంత్ మాట్లాడుతూ.. ఒక మంచి సినిమాకి మ్యూజిక్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. కథకు తగ్గట్లుగా ఎంతో కష్టపడి ది  బెస్ట్  సాంగ్స్, ఫిదా కన్నా మంచి సాంగ్స్ ఇస్తాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన జెమిని సంస్థకు నా థాంక్స్. అలాగే కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ కి అవకాశాలు కల్పించి ఒక మ్యూజిక్ ప్లాట్ పామ్ ఏర్పాటు చేయబోతున్నాం. దానికి నన్ను క్రియేటివ్ హెడ్ గా నియమించిన జెమినీ వారికీ నా కృతఙ్గ్యతలు. సింగర్స్, రైటర్స్, పరిచయం చేసి ఆల్ ఓవర్ ఇండియా లలో షోస్ చేయబోతున్నాం. పంజాబీ, హిందీ, ఆల్ లాంగ్వేజెస్ లలో ట్రెడిషనల్ ఫోక్ సాంగ్స్, ప్రయివేట్ సింగర్లుతో ఆల్బమ్స్, పాన్ ఇండియా లెవెల్ లో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీగా భావిస్తున్నాను.. దీని ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు బయిటికి వస్తారు. ఎప్పటినుండో ఇలా చేయాలనీ  నా డ్రీమ్. అది జెమిని ద్వారా నెరవేరుతున్నందుకు చాలా హ్యాపీగా వుంది.. అన్నారు.

అనురాగ్ కొణిదెన, అవికా గోర్, పోసాని కృష్ణమురళి, తులసి, ఎస్ ఎస్ కాంచి, సుదర్శన్, ఆటో రాంప్రసాద్, రచ్చ రవి, మురారి శ్రీనివాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శక్తికాంత్, కెమెరా; రఘు, కో-డైరెక్టర్: మధు, ఆర్ట్: వెంకటేశ్వరరావు, స్టిల్స్: సుబ్బు, ప్రొడక్షన్ కంట్రోలర్: ప్రసాద్, మేనేజర్: రాజేష్, పిఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు, నిర్మాత: కోటేశ్వరరావు కె, దర్శకత్వం: సత్యం ద్వారపూడి.  

Advertisement
CJ Advs

Anurag Konidela and Avika Gore new movie!:

<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large XcVN5d tw-ta" dir="ltr"><span lang="en">Anurag Konidela and Avika Gore new movie!</span></pre>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs