Advertisement
Google Ads BL

ఉప్పెనంత ఊపుతో కళ్యాణ్ రామ్ ఫిల్మ్


నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ కొత్త చిత్రం

Advertisement
CJ Advs

హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 19వ చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడకన్ నెం.14 గా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా  రాజేంద్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి బుచ్చిబాబు సానా క్లాప్ కొట్టారు. ద‌ర్శ‌కులు భ‌ర‌త్ క‌మ్మ, రాధాకృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో క‌ల్యాణ్ రామ్‌, నిర్మాత న‌వీన్ ఎర్నేని, సీఈఓ చెర్రీ .. చిత్ర ద‌ర్శ‌కుడు రాజేంద్ర‌కు స్క్రిప్ట్‌ను అందించారు. మార్చి రెండో వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సినిమాలో హీరోయిన్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. 

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  ఎర్నేని అనిల్‌, సీఈఓ:  చెర్రీ, నిర్మాత‌లు:  న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, కథ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  రాజేంద్ర‌.

Mythri Movie Makers - Nandamuri Kalyanram Movie launch:

<span>Mythri Movie Makers launches film with Nandamuri Kalyanram as hero</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs