Advertisement
Google Ads BL

అల్లరోడే పిల్లడే.. లిరికల్ సాంగ్ లాంచ్


ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నందమూరి తారకరత్న హీరోగా సారధి(కోకో నేపథ్యం) చిత్రం లోని అల్లరోడే  పిల్లడే.. లిరికల్ సాంగ్  లాంచ్

Advertisement
CJ Advs

 పంచభూత క్రియేషన్స్ పతాకంపై నందమూరి తారక రత్న ,కోన శశిత జంటగా జాకట రమేష్ దర్శకత్వంలో పి. నరేష్ యాదవ్, వై యస్ కృష్ణమూర్తి, పి సిద్దేశ్వర్ రావులు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం సారధి(కోకో నేపథ్యం) సిద్ధార్థ్ వాటికన్స్ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రం లోని అల్లరోడే  పిల్లడే.. లిరికల్ సాంగ్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా  ఈ రోజు హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్లో ,ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు విడుదల చేశారు.అనంతరం

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 2020 జనవరిలో  జకట రమేష్ దర్శకత్వంలో రదేరా (కోకో గేమ్) సినిమా రిలీజ్  చేయడం జరిగింది ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఎన్నో సంవత్సరాల తరువాత. కడపలో మూడు థియేటర్లు హౌస్ ఫుల్ అవ్వడం జరిగింది. అలాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఆ సినిమాకు కంటిన్యూటిగా "సారధి" (కోకో గేమ్) పై నందమూరి తారకరత్న తో పార్ట్ 2  తీస్తున్నాడు.వీరు నలుగురు ఒక టీం ఏర్పడి ఈ  సినిమా తీస్తున్న ఈ సినిమాలోనిఈ సాంగ్ వింటుంటే.. ఇప్పుడు వస్తున్న సాంగ్ వాయిద్యాలు, సౌండ్స్ లలో లిరికిల్ వ్యాల్యూస్ తెలియక ఎదో ఒక సాంగ్ చేస్తున్నారు.ఇలాంటి టైంలో వీరు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా  అల్లరోడే పిల్లడే - వాడి గుండెల్లో వుంటడే, తుంటరోడే వాడెప్పుడూ - కళ్ళల్లోనే వుంటడే,సాంగ్ వింటుంటే పర్ఫెక్ట్ గా అందరూ పాడుకునే విదంగా అర్ధమయ్యే విదంగా ఉంది.ఇలాంటి సాంగ్ లాంచ్ చేసినందుకు సంతోషంగా వుంది.ఈ సినిమా షూటింగ్ అంతా మన లోకేషన్స్ లలో తీసినా ఫారిన్ లొకేషన్స్ లలో తీసినట్టుగా ఉంది. కడపలో మనకు కావలసిన వాటర్ ఫాల్స్ రకరకాల అద్భుతమైన అందాలు ఉన్నాయి.పంచభూత క్రియేషన్స్ బ్యానర్లో నందమూరి తారకరత్న లాంటి హీరోతో  సారథి(కోకో నేపథ్యం) అనే  అద్భుతమైన టైటిల్ తో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో మన ముందుకు వస్తున్నారు.హిందీలో కూడా  స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో  అమీరఖాన్,షారుక్ ఖాన్ లు నటించిన చిత్రాలు ఎంతో పెద్ద హిట్ అయ్యాయి.అలాంటి సినిమాల మాదిరే ఈ  సినిమా కూడా పెద్ద విజయం సాధించి టీం అందరికీ మంచి పేరు తో పాటు,వీరు ఇలాంటి మంచి చిత్రాలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నానని అన్నారు.

నిర్మాత సి.యన్.రావు మాట్లాడుతూ... కొత్త వారైనా ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు.ఇందులో నటించిన నందమూరి తారకరత్న కు సారథి(కోకో నేపథ్యం) టైటిల్ యాప్ట్ గా ఉంది. ఈ సినిమా నిర్మించిన చిత్ర బృందానికి పెరుతో పాటు గొప్ప విజయం కలగాలని కోరుతున్నాను.

ఈ చిత్ర నిర్మాతలు  పి.నరేష్ యాదవ్, వై యస్ కృష్ణమూర్తి, పి సిద్దేశ్వర్ రావులు మాట్లాడుతూ...

తారకరత్న తో  మేము చేస్తున్న సారథి(కోకో నేపథ్యం)  సినిమాను స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో   లవ్, రొమాన్స్, యాక్షన్ లను జోడిస్తూ మా టీం అంతా ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాము.ఈ సినిమాకు సిద్ధార్థ వాటికన్స్  అద్భుతమైన సంగీతం అందించాడు.సాహితీ చాగంటి గారు పాడిన అల్లరోడే పిల్లడే లిరికల్ సాంగ్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు మా సారథి(కోకో గేమ్) మూవీ లోని అల్లరోడే పిల్లడే లిరికల్ సాంగ్ ను ప్రసన్న కుమార్ గారు లాంచ్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది.సిద్దార్థ్ గారు ఈ సాంగ్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. పంచభూత క్రియేషన్స్ లో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరు ఆదరించి మా చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకొంటున్నానని అన్నారు.

జకట రమేష్ మాట్లాడుతూ... గతంలో రథేరా (కోకో గేమ్) సినిమా చేశాను.ఆ సినిమా ట్రైలర్ చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యారు .విజయేంద్ర ప్రసాద్ గారు వి.వి.వినాయక్ గారు చాలా ఇంప్రెస్ అయి నాకు ప్రశంసలు ఇచ్చారు.సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయేంద్ర ప్రసాద్ గారు పిలిచి అప్రిషియేట్ చేసి నీకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పడం నేను లైఫ్ లో  మరచిపోలేను.ఈ సినిమాకు మనోహర్ గారి విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి.మ్యూజిక్ డైరెక్టర్ సిద్దార్థ ,లిరిక్స్ రాసిన ఉమేష్ గార్లు మాకు లైఫ్ లో మరచిపోలేని గొప్ప సాంగ్ ఇచ్చారు.అలాంటి ఈ సాంగ్ ను చిన్న సినిమాలకు వెన్నంటి నిలిచే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ చేతుల మీదుగా విడుదల అవ్వడం మా కెంతో సంతోషం కలిగింది.అప్పుడు మా రదేరా(కోకో గేమ్) సినిమాకు  ప్రసన్న గారు ఎంతో సపోర్ట్ చేశారు .ఇప్పుడు కూడా ప్రసన్న గారు ఈ సినిమా రిలీజ్ కి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు.వారికి మా ధన్యవాదాలు.రదేరా (కోకో గేమ్) సినిమాను మేము జనవరి ఫస్ట్ కు రిలీజ్ చేయడం వల్ల థియేటర్లు తగ్గినా ఆ సినిమా మాకు మంచి పేరు తీసుకువచ్చింది. దాని కంటిస్యూటిలోనే సారధి (కోకో గేమ్) తారకరత్న పైన పార్ట్ 2 గా చేయడం జరిగింది.కోవిడ్ టైంలో కూడా నందమూరి తరకరత్న మాకు ఏంతో సపోర్ట్ చేశారు.ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు సారధి రూపంలో మంచి కంటెంట్ ఇస్తున్నాను .ఇది నాకు రెండవ సినిమా అయినా నందమూరి తారకరత్న తో చేస్తున్న సారథి సినిమా అద్భుతంగా వచ్చింది.ఇది చిన్న సినిమాగా మొదలైన ఈ సినిమాను  మా నిర్మాతలు ఖర్చుకు వెనకడకుండా పెద్ద సినిమాకు అయ్యే బడ్జెట్ పెట్టి పెద్ద సినిమాల లిస్ట్ లో పెట్టారు.ఇది నాకు రెండవ సినిమా అయినా సారథి(కోకో గేమ్)  సినిమా అద్భుతంగా వచ్చింది.ఆ సినిమాను ఆదరించినట్లే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకొంటున్నాను అని అన్నారు.

సంగీత దర్శకుడు సిద్ధార్థ మాట్లాడుతూ..ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నేను అందించిన అల్లరోడే  పిల్లడే.. లిరికల్ సాంగ్ సినీ ప్రముఖుల సమక్షంలో లాంచ్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను

Allarodu Pillado lyrical song launch:

Allarodu Pillado lyrical song launch by Tarakartna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs