Advertisement
Google Ads BL

అందరికీ సరైన సందర్భం దొరికింది


మన చుట్టూ ఉండే జీవితాల కథలు, ఆ కథల్లో నిజాయితీ, కథనంలో సహజత్వంతో సినిమాలు చేసే దర్శకుడు శేఖర్ కమ్ముల. అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఆయన రూపొందించిన కొత్త సినిమా లవ్ స్టోరి. టీజర్ తో రేవంత్, మౌనికలుగా చైతూ, సాయి పల్లవిని పరిచయం చేసిన శేఖర్ కమ్ముల....ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారి ప్రేమ కథ ఎలాంటిదో పాటతో తెలియజేశారు. ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి పాడారు. పవన్ సీహెచ్ సంగీతాన్ని అందించారు. నీ చిత్రం చూసి.. పాట లిరికల్ వీడియోను వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ రోజు (ఫిబ్రవరి14) ఉదయం 10.08 నిమిషాలకు విడుదల చేశారు.

Advertisement
CJ Advs

నీ చిత్రం చూసి...పాటలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రేమ చిహ్నాలను పెయిటింగ్స్ రూపంలో చూపించారు. హైదరాబాద్ నగర జీవితాన్ని తన చిత్రాలతో అద్భుతంగా చూపించిన ప్రముఖ చిత్రకారుడు మోషే దయాన్ ఈ పాటలోని చిత్రాలను గీశారు. ఈ లిరికల్ వీడియో లో అలనాటి హైదరాబాద్ ప్రేమ చిహ్నలైన పురాణ పూల్, తారామతి బరాదారి, కోటి రెసిడెన్సీ, బ్రిటిష్ రెసిడెన్సీ లను చూపించిన శేఖర్ కమ్ముల చివరగా రేవంత్ మౌనిక ప్రేమ వారధి అయిన రేవంత్జుం బా సెంటర్ ను పాటలో చూపించారు. భాగ్యనగర ప్రేమ సౌధాలను పేర్కొంటూ  రేవంత్ జుంబా సెంటర్ ను చూపించడం ద్వారా వీళ్లిద్దరి ప్రేమ కథ కూడా అలాంటి గొప్పదేనని దర్శకులు శేఖర్ కమ్ముల చెప్పకనే చెప్పారు. ఏప్రిల్ 16న లవ్ స్టోరి సినిమా థియేటర్ లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

మార్చి5న రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల పవర్ ప్లే.

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ పవర్ ప్లే. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కి మంచి  రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మార్చి 5న గ్రాండ్‌గా  విడుద‌ల‌చేయ‌నున్నారు. ఈ రోజు వాలైంటైన్స్ డే సంద‌ర్భంగా స్పెషల్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ రొమాంటిక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా...

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ  - నేను విజ‌య్‌గారు క‌లిసి స‌రికొత్త జోన‌ర్‌లో చేస్తోన్న డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్ ఇది.  క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ కొండా మాట్లాడుతూ - ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. డెఫినెట్‌గా అంద‌ర్నీ థ్రిల్ చేస్తుంది అన్నారు.

చిత్ర నిర్మాత దేవేష్ మాట్లాడుతూ - ఈ వాలైంటైన్స్ డే సంద‌ర్భంగా ప‌వ‌ర్‌ప్లే టీమ్ త‌రుపున  ఒక కాంటెస్ట్ నిర్వ‌హిస్తున్నాం. మీరు మీ వాలైంటైన్‌తో క‌లిసి ల‌వ్ ప్ర‌పోజ్ చేస్తూ ఒక షార్ట్ వీడియో తీసి దానికి @𝘃𝗮𝗻𝗮𝗺𝗮𝗹𝗲𝗲_𝗰𝗿𝗲𝗮𝘁𝗶𝗼𝗻𝘀 ని టాగ్ చేసి మీ సోష‌ల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేయండి. ఈ నెల 16వ తారీకు వ‌ర‌కూ మీరు వీడియోస్ పంపొచ్చు. ఫిబ్ర‌వ‌రి 18న ఈ కాంటెస్ట్‌లో గెలిచిన జంటలు దుబాయ్ ట్రిప్ సొంతం చేసుకుంటారు అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి మాట్లాడుతూ - మార్చి 5 ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

రాజ్ త‌రుణ్‌, హేమ‌ల్ ఇంగ్లే, పూర్ణ‌, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌, కేద‌రి శంక‌ర్‌, టిల్లు వేణు, భూపాల్‌, అప్పాజీ, ర‌వివ‌ర్మ‌, సంధ్య‌ జ‌న‌క్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి

మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 9 టైటిల్ అర్జున ఫ‌ల్గుణ‌

ఒక‌వైపు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైనర్స్‌, మ‌రోవైపు యువ ప్ర‌తిభావంతుల‌తో కంటెంట్ రిచ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ నిర్మిస్తూ ప‌ర్ఫెక్ట్ స్ట్రాట‌జీతో ముందుకు వెళ్తోన్న సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.

శ్రీవిష్ణు హీరోగా, జోహార్ ఫేమ్ తేజ మ‌ర్ని ద‌ర్శ‌క‌త్వంలో ఆ సంస్థ నిర్మిస్తోన్న ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 9కు ఆదివారం అర్జున ఫ‌ల్గుణ అనే టైటిల్ ప్ర‌క‌టించారు. మ‌హాభార‌తంలో అర్జునునికి ఫ‌ల్గుణ అనే మ‌రో పేరు కూడా ఉంద‌ని మ‌న‌కు తెలుసు. ఫాల్గుణ మాసంలో జ‌న్మించినందున ఆయ‌నను ఆ పేరుతోనూ పిలుస్తుంటారు.

టైటిల్ పోస్ట‌ర్‌లో ఐదుగురు వ్య‌క్తులు ప‌రుగులు పెడుతుంటే, వారిని ఓ పోలీస్ జీప్ వెంటాడుతోంది. పైన వ్య‌క్తుల ముఖాలు మ‌న‌కు క‌నిపించ‌డం లేదు. కానీ వారు ప‌రుగెత్తుతుండ‌గా, ప‌క్క‌నే ఉన్న కాల‌వ‌లో వారి ప్ర‌తిబింబాలు క‌నిపిస్తున్నాయి. ఆ ప్ర‌తిబింబాలు ఎవ‌రివో వెల్ల‌డ‌వుతున్నాయి. హీరో హీరోయిన్లు, వారి ముగ్గురు ఫ్రెండ్స్.. పోలీసుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి పారిపోతున్నార‌ని ఆ పోస్ట‌ర్ తెలియ‌జేస్తోంది. టైటిల్ డిజైన్‌ను రెగ్యుల‌ర్‌గా కాకుండా సంస్కృత లిపి త‌ర‌హాలో డిజైన్ చేయ‌డం గ‌మ‌నార్హం.

మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న మ‌రో ఉత్తేజ‌భ‌రిత చిత్రం అర్జున ఫ‌ల్గుణ‌. ఎప్పుడూ వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల‌నే ఎంచుకుంటూ ఉంటార‌ని పేరుపొందిన శ్రీ‌విష్ణు మ‌రో ఆస‌క్తిక‌ర కాన్సెప్ట్‌తో మ‌న ముందుకు రానున్నారు. మ‌రోవైపు, డైరెక్ట‌ర్‌గా త‌న తొలి చిత్రం జోహార్‌ తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందారు తేజ మ‌ర్ని. ఇలాంటి హీరో, డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ల తొలి క‌ల‌యిక 2021లో ఒక ఆస‌క్తిక‌ర చిత్రాన్ని అందించ‌నున్న‌ద‌ని క‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు.

ఇప్ప‌టివ‌ర‌కూ అర్జున ఫ‌ల్గుణ‌కు సంబంధించి 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.

శ్రీ‌విష్ణు స‌ర‌స‌న నాయిక‌గా అమృతా అయ్య‌ర్ న‌టిస్తోన్న‌న ఈ చిత్రాన్ని నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్‌.ఎం. పాషా స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ మూవీకి క‌థ‌, స్క్రీన్‌ప్లేల‌ను ద‌ర్శ‌కుడు తేజ మ‌ర్ని స్వ‌యంగా స‌మ‌కూరుస్తున్నారు. సుధీర్ వ‌ర్మ పి. డైలాగ్స్ రాస్తున్నారు.

ప్రియ‌ద‌ర్శ‌న్ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ మ్యూజిక్ అందిస్తుండ‌గా, జ‌గ‌దీష్ చీక‌టి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

తారాగ‌ణం:

శ్రీ‌విష్ణు, అమృతా అయ్య‌ర్‌, సీనియ‌ర్ న‌రేష్‌, శివాజీ రాజా, సుబ్బ‌రాజు, దేవీప్ర‌సాద్‌, రంగ‌స్థ‌లం మ‌హేష్‌, రాజ్‌కుమార్ చౌద‌రి (రాజావారు రాణిగారు ఫేమ్‌), చైత‌న్య (మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్‌).

మ్యాచో హీరో గోపీచంద్ - అల్లు అరవింద్-సక్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడు మారుతి - బ‌న్నీవాసు కాంబినేష‌న్ లో జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం 4 టైటిల్ ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్

ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌రువాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేయ‌బోయే సినిమా పై అంతటా ఆస‌క్తి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే, ఆ ఉత్కంఠ‌కి తెర దించుతూ ఇటీవ‌లే మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్ తో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు ద‌ర్శ‌కుడు మారుతి. ఈ ప్ర‌క‌ట‌ణకు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ వ‌రుకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఇదే రీతిన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కొన్ని కీల‌క ప్ర‌క‌ట‌ణ‌ల‌ను సైతం ద‌ర్శ‌కుడు మారుతి త‌న‌దైన శైలిలో విడుద‌ల చేస్తూ వచ్చారు. ఈ చిత్ర విడుదల తేదీని కార్టూన్ క్యారకేచ‌ర్లు వాడుతూ వినూత్నంగా ప్ర‌క‌టించ‌డం కూడా అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రానికి ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ అనే టైటిల్ ని ప్ర‌క‌టించి, టైటిల్ లుక్ ని విడుద‌ల చేశారు. ఈ సినిమాతో ముచ్చ‌ట‌గా మూడోసారి జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - మారుతి కాంబినేష‌న్ సెట్ అయింది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ ద్వారానే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్స్ బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు జి ఏ2 పిక్చర్స్, యూ వి క్రియేషన్స్ లో భలే భలే మగాడివోయ్, టాక్సీవాల, ప్రతిరోజు పండుగ తో హాట్ట్రిక్ రాగా ఇప్పుడు డబల్ హాట్ట్రిక్ కి శ్రీకారం చుడుతూ గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ అక్టోబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకి రాబోతుంది, ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు, ఎస్ కే ఎన్ సహ నిర్మాత‌. మార్చి 5 నుంచి ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ షూట్ మొద‌ల‌వ్వ‌బోతుంది, ఇందులో హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యాన్ని త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌ణ రానుంది.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణగారి చేతుల మీదుగా సురాపానం మూవీ టైటిల్ లోగో ఆవిష్కరణ

అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై సంపత్ కుమార్ దర్శకత్వం వహించిన సురాపానం మూవీ టైటిల్ లోగో ఆవిష్కరణ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణగారి చేతుల మీదుగా.. రవీంద్రభారతి పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో నిర్వహించారు. ఈ సందర్బంగా దర్శకుడు సంపంత్ కుమార్ మాట్లాడుతూ.. సురాపానం మూవీ కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమని, ఒక విభిన్నమైన సరికొత్త కథాంశంతో ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ ఆనందాన్ని, ఒక మంచి అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. ప్రొడ్యూసర్ మట్ట మధు యాదవ్ మాట్లాడుతూ.. కథ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, సినిమా ఖచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపారు.

సంపత్ కుమార్, ప్రగ్య నయన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ అఖిల్, సీనియర్ నటులు సూర్య, అజయ్ ఘోష్, ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్, విద్యాసాగర్, అంజి బాబు, చమ్మక్ చంద్ర, కోటేశ్వరరావు, జెన్నీ, గిరి పోతరాజు తదితరులు నటించారు.ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్  సిసిరోలియో

వాలెంటైన్స్ డే సందర్భంగా స‌త్య‌దేవ్, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా గుర్తుందా శీతాకాలం ఫస్ట్ లుక్ విడుదల.. 

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగ శేకర్ తెరకెక్కిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ప్ర‌తీ ఒక్క‌రు త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విష‌యాల్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌ణ‌లు ప్రేక్ష‌కుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్ మీద నాగ‌శేఖ‌ర్ - భావ‌న‌ర‌వి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు గారు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ఇప్ప‌టికే ఈ సినిమా టైటిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. టాలెంటెడ్ హీరో స‌త్యదేవ్, త‌మ‌న్నా, మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి కూడా బాగానే పెరిగిపోయింది. ఇండ‌స్ట్రీలో వ‌ర్గాల్లోనూ ఈ సినిమా పై ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. క‌న్న‌డ‌లో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ల‌వ్ మాక్ టేల్ ఆధారంగా గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ షూట్ చేసుకుని మ‌రో షెడ్యూల్ షూట్ చేసుకోవ‌డానికి సెట్స్ మీద‌కు వెళుతుంది గుర్తుందా శీతాకాలం. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న గుర్తుందా శీతాకాలం చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసారు. అందులో సత్యదేవ్, తమన్నా ఒకర్నొకరు రొమాంటిక్‌గా చూసుకుంటూ చేతులు కలుపుకుని ఉన్నారు. ఈ ఫోటో అభిమానులకే కాదు అందరికీ బాగా నచ్చేస్తుంది. త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్ విడుదల కానుందని తెలిపారు దర్శక నిర్మాతలు. మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.

Valentines day Movie Special Posters:

Valentines day Movie Special Posters and mattres
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs