జె.ఎస్ ఫిలిమ్స్ పతాకం పై దొరైరాజు వూపాటి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం పటారుపాళెం ప్రేమ కథ శ్రీ మానస్, సమ్మోహన హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయి ప్రేక్షకులను ఆకట్టుకున్న సాంగ్స్, టీజర్ లా ఇప్పుడు విడుదల అయిన ఈ ట్రైలర్ ఈ సినిమా కథ పట్ల సర్వత్రా ఆసక్తి రేపుతుంది. కాగా ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ మా సినిమా మిర్యాలగూడ ప్రణయ్ అమృత అండ్ హేమంత్ అవంతిక కథ అంటూ, అలానే వేరే వాళ్ళ రియల్ లైఫ్ స్టోరీ అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. వాటికి అతి త్వరలో మేమె ఒక సమాధానం చెప్తాము అని అన్నారు. కాగా ఈ సినిమా గురించి, ఈ సినిమా కథ అదే అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని కథనాలు చాలా వెలువడిన సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమాకు కెమెరా ఆర్ కె ములింటి. వి లతా రెడ్డి, వి సౌజన్యా దొరై రాజు, బి. ఆర్ బాలు, కె రామకృష్ణ ప్రసాద్ లు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను జె.ఎస్ రెడ్డి సమర్పిస్తున్నారు. కొన్ని యదార్థ సంఘటనలను ఆధారం చేసుకుని, పరువుహత్యాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది, అతి త్వరలో గ్రాండ్ గా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.