Advertisement
Google Ads BL

మోసగాళ్లు పాటకు అద్భుతమైన స్పందన


విష్ణు మంచు హీరోగా న‌టిస్తోన్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మోస‌గాళ్లు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ప్యాన్ ఇండియా ఫిల్మ్‌గా ఇది విడుదలవుతోంది.

Advertisement
CJ Advs

24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ అండ్ ఎవిఎ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా ప్లాన్ చేసారు నిర్మాత, హీరో మంచు విష్ణు. ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌కు, టీజ‌ర్ల‌కు సూప‌ర్బ్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాలోని సంపాదించాలంటే.. ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన లభించింది.

తాజాగా విడుదల చేసిన డబ్బే మనది కుమ్మేస్కో... మస్తీ మస్తీ చేసేస్కో... కాస్ట్లీ మందే వేసేస్కో... లిరికల్ వీడియోకు కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సామ్ సీఎస్ స్వరపరిచిన ఈ పాటకు లిరిసిస్ట్ సిరాశ్రీ సాహిత్యం అందించారు. సింగర్ హేమచంద్ర తనదైన శైలిలో ఈ పాటను ఆలపించి మెప్పించారు.చ‌రిత్ర‌లో న‌మోదైన అతిపెద్ద ఐటీ స్కామ్ నేప‌థ్యంలో త‌యార‌వుతున్న మోస‌గాళ్లు చిత్రానికి లాస్ ఏంజెల్స్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. 51కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మోసగాళ్లు చిత్రాన్ని డా.మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో విడుదలకానుంది. 

Vishnu Manchu Dabbe Manadi Song From Mosagallu :

Vishnu Manchu Dabbe Manadi Song From Mosagallu Gets Thumbs Up
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs