ప్రపంచ వ్యాప్తంగా మార్చ్ 5న వస్తోన్న డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రం A.
యంగ్ టాలెంటెడ్ యాక్టర్ నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై మోస్ట్ క్రియేటివ్ టెక్నికల్ డైరెక్టర్ యుగంధర్ ముని దర్శకత్వంలో టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ గీతా మిన్సాల నిర్మించిన డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రం A. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేశారు. ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విజయ్ కురాకుల సంగీత సారథ్యంలో అనంత్ శ్రీరామ్ అద్భుత సాహిత్యాన్ని అందించిన ఈ చిత్రంలోని పాటలు ఆల్రెడీ మార్కెట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న A చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా మార్చి 5న పీవీఆర్ సినిమా విడుదల చేస్తుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నితిన్ ప్రసన్న, హీరోయిన్ ప్రీతి అస్రాని, దర్శకుడు యుగంధర్ ముని, సంగీత దర్శకుడు విజయ్ కురాకుల, కెమెరామెన్ ప్రవీణ్ కె. బండారి, ప్రాజెక్ట్ డిజైనర్ వినయ్, ఎడిటర్ ఆనంద్, పివిఆర్ ప్రతినిధి ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.. అనంతరం A చిత్రంలోని, మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్, పాటల్ని ప్రదర్శించారు.. హైటెక్నీకల్ విజువల్స్ తో ఇంట్రెస్టింగా రూపొందిన A సినిమాలోని ట్రైలర్స్ సాంగ్స్ చూపరులను అమితంగా ఆకట్టుకున్నాయి.
పివిఆర్ ప్రతినిధి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. A సినిమా టీజర్, ట్రైలర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగా క్యూరియసిటీగా ఉన్నాయి. రెగ్యులర్ ఫిల్మ్ లా కాకుండా సంథింగ్ డిఫరెంట్ జోనర్ లో యుగంధర్ ఈ సినిమాని రూపొందించారు. అందరూ కొత్త వాళ్ళు అయినప్పటికీ హానెస్ట్ గా సినిమా తీశారు. కొత్త హీరో నితిన్ ప్రసన్న తో ప్రయోగం చేశాడు యుగంధర్. రోజు రోజుకీ ఈ సినిమాకి బజ్ పెరుగుతూనే ఉంది. డెఫినెట్ గా ఈ చిత్రం కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది. దర్శకుడు యుగంధర్ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని మార్చ్ 5న హైయ్యెస్ట్ థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నాం. ఇంత మంచి చిత్రాన్ని మా సంస్థ ద్వారా విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది.. అన్నారు.
హీరోయిన్ ప్రీతీ అస్రాని మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఇన్నోసెంట్, స్వీట్ గర్ల్ పల్లవి క్యారెక్టర్లో నటించాను. రెగ్యులర్ హీరోయిన్స్ క్యారెక్టర్ లా కాకుండా టీనేజ్, మదర్ రెండు ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్న ఛాలెంజింగ్ పాత్ర చేయడం చాలా టఫ్ అనిపించింది. ఎంతో రిహార్సల్స్ చేయించి నాతో అద్భుతంగా చేయించిన డైరెక్టర్ యుగంధర్ మునికె ఈ క్రెడిట్ దక్కుతుంది. బేసిగ్గా ఛాలెంజింగ్ గా ఉండే పాత్రలు అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి పాత్ర ఈ మూవీలో చేయడం చాలా హ్యాపీగా ఉంది. విజయ్ కురాకుల బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ప్రవీణ్ కె. బండారి ప్రతీ ఫ్రెమ్ పెంటాస్టిక్ విజువల్స్ తో చిత్రీకరించారు. సైన్స్, ఫిక్షన్ బాక్డ్రాప్ లో డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంగా యుగంధర్ రూపొందించారు. సినిమా చూశాక పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అని ఆడియెన్స్ అంతా ఫీలవుతారు. ఈ సినిమా నాకు వండర్ ఫుల్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చింది.. ఈ సినిమా ఎప్పుడూ ఒక మెమరబుల్ మూవీగా ఉండాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
హీరో నితిన్ ప్రసన్న మాట్లాడుతూ.. ఈ సినిమా ఆడిషన్స్ కి త్రీ మంత్స్ పట్టింది. ఏ సినిమాలోనైనా ఒక క్యారెక్టర్ చేయడమే చాలా కష్టం. అలాంటిది ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ని నాతో చేయించారు డైరెక్టర్ యుగంధర్. చాలా చాలా హై కాన్సెప్ట్ థ్రిల్లర్ ఫిల్మ్. ప్రతీ సీన్ డిటైల్డ్ గా రీసెర్చ్ చేసి షూట్ చేశారు. చాలా టైమ్ తీసుకొని ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేశారు. స్టోరీ బోర్డ్ లో ఏదైతే అనుకున్నారో అదే సెట్స్లో చిత్రీకరించారు. షూటింగ్ కి ముందే రిహార్సల్స్ చేసి సెట్స్ కి వెళ్ళాం. అది మంచి ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. న్యూయార్క్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో ట్రైనింగ్ అయి యుగంధర్ చాలా డిఫరెంట్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. పెంటాస్టిక్ లైటింగ్స్, విజువల్స్ తో ప్రవీణ్ ఈ చిత్రాన్ని బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశాడు. రెగ్యులర్ ఫిల్మ్ లా కాకుండా హాలీవుడ్ స్థాయిలో A సినిమా ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. కొత్త ఐడియా స్ వచ్చే ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్స్ ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
చిత్ర దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ.. ఇది నా ఫస్ట్ మూవీ. నా ఈ జర్నీలో చాలా మంది నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. వారందరికీ నా థాంక్స్. ముఖ్యంగా నా భార్య గీతకు స్పెషల్ థాంక్స్. తను లేకపోతే ఇంత దూరం వచ్చేవాడ్ని కాదు. అందరూ కొత్తవాళ్ళతో ఈ సినిమా చేశాను. విజయ్ ఎక్స్ ట్రార్డినరి మ్యూజిక్ ఇచ్చాడు. అనంత్ శ్రీరామ్ బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. పాటలకు, ట్రైలర్స్ కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. నితిన్ ప్రసన్న ఈ చిత్రంలో మూడు పాత్రలను పోషించారు. ఒక కమింగ్ యాక్టర్ ఇలాంటి రిస్కీ సబ్జెక్ట్‌ను టచ్ చేయడమే కాదు, మూడు పాత్రలను చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి. ప్రీతి అస్రాని సూపర్బ్ పెర్ఫార్మెన్స్ చేసింది. ట్రైలర్ విషయానికి వస్తే.. ఒక వైపు సైన్స్, మరో వైపు పూర్వజన్మ జ్ఞాపకాలు అనే కాన్సెప్ట్‌తో సినిమా ఉందనిపించేలా ఆసక్తికరంగా ట్రైలర్ ఉంది. విజయ్ కూరకుల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ప్రవీణ్ కె.బంగారి సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్ ఎసెట్‌గా నిలువనున్నాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో A సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నితిన్ ప్రసన్న, ప్రీతీ వాండ్రఫైల్ యాక్ట్ చేశారు. ప్రతీ సీన్ రిహార్సల్స్ చేసి షూట్ చేశాం. ప్రసాద్ ల్యాబ్స్ లో విఎఫెక్స్ చేపించాం.. స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ప్రతీ ఒక్కరూ ది బెస్ట్ ఔట్ ఫుట్ ఇచ్చారు. సినిమా చూసి బాగా ఇంప్రెస్ అయి పివిఆర్ ఉదయ్ వరల్డ్ వైడ్ గా మా A చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.. ఎన్నో సలహాలు సూచనలు ఆయన మాకు ఇచ్చారు. వారికి మా యూనిట్ తరుపున చాలా థాంక్స్.. అన్నారు.
నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్:ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైన్: బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్: సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్), ఎడిటింగ్: ఆనంద్ పవన్, మణి కందన్ (ఎఫ్‌టిఐఐ), సంగీతం; విజయ్ కురాకుల, నిర్మాత; గీతా మిన్సాల, దర్శకత్వం; యుగంధర్ ముని.