Advertisement
Google Ads BL

షర్మిల విడుదల చేసిన కల్పిత పాత్రల పాట.!


వైఎస్ షర్మిల చేతుల మీదుగా ఈ కథలో పాత్రలు కల్పితం సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల

Advertisement
CJ Advs

పవన్‌ తేజ్‌ కొణిదెలని హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో.. రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న చిత్రం ఈ కథలో పాత్రలు కల్పితం. మేఘన హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ పోస్టర్స్‌‌కి, సాంగ్స్‌కి, టీజర్‌కి మంచి స్పందన వస్తోన్న నేపథ్యంలో చిత్రయూనిట్ తాజాగా చిత్రంలోని సెకండ్ లిరికల్ సాంగ్‌ను పొలిటికల్ సర్కిల్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోన్న వైఎస్ షర్మిల చేతుల మీదుగా ఫిబ్రవరి 12న సాయంత్రం 4గంటల 05 నిమిషాలకు విడుదల చేశారు. సాంగ్ విడుదల అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. సాంగ్ చాలా బాగుందని, చిత్రం కూడా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమైన ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలోకి రానుంది.

సాంగ్ విడుదల సందర్భంగా నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ.. మా చిత్రంలోని సెకండ్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేసిన వైఎస్ షర్మిలగారికి చిత్రయూనిట్ తరపున హృద‌య‌పూర్వ‌క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చిత్రం చాలా బాగా వచ్చింది. ఆడియెన్స్ థ్రిల్ ఫీలయ్యే విధంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో, ఎంటర్‌టైన్‌మెంట్ జోడించి దర్శకుడు అభిరామ్ ఈ కథలో పాత్రలు కల్పితం చిత్రాన్ని రూపొందించారు. హీరో పవన్ తేజ్ కొణిదెల లాంఛింగ్ ఫిల్మ్‌తోనే అందరినీ ఆకట్టుకుంటాడు. నటీనటులందరూ ఈ చిత్రం కోసం ఎంతగానో తోడ్పడ్డారు. వారందరికీ ధన్యవాదాలు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము.. అని తెలిపారు. 

డైరెక్టర్ అభిరామ్ ఎమ్‌ మాట్లాడుతూ.. అందరి సహకారంతో ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా నిర్మాత రాజేష్ నాయుడుగారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు. ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే హీరోగా పరిచయం అవుతున్న పవన్ తేజ్ కొణిదెలకు ఇది పర్ఫెక్ట్ లాంచింగ్ ఫిల్మ్ అవుతుంది. ఈ సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటాడు. తాజుద్దీన్‌ సయ్యద్ డైలాగ్స్, సునీల్ కుమార్ సినిమాటోగ్రఫీ, కార్తీక్‌ కొడకండ్ల సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. చిత్ర సెకండ్ లిరికల్ సాంగ్‌ను ఆవిష్కరించి, మా యూనిట్‌కి అభినందనలు తెలిపిన వైఎస్ షర్మిలగారికి ధన్యవాదాలు.. అన్నారు.

నటీనటులు: పవన్‌ తేజ్‌, మేఘన,

సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌.ఎన్‌, సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల, ఎడిటింగ్‌: శ్రీకాంత్‌ పట్నాయక్‌. ఆర్‌- తిరు, ఫైట్స్‌: షావోలిన్‌ మల్లేష్‌, ఆర్ట్‌: నరేష్‌ బాబు తిమ్మిరి, డైలాగ్స్ అండ్ ఎడిషినల్ స్క్రీన్‌ప్లే: తాజుద్దీన్‌ సయ్యద్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సియ డిజైన‌ర్స్‌, విఎఫ్ఎక్స్: విజువ‌ల్స్ ఫ్యాక్ట‌రీ(తిరు), ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: ఎజె ఆర్ట్స్‌, (అజయ్ కుమార్), నిర్మాత: రాజేష్‌ నాయుడు, క‌థ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: అభిరామ్ ఎమ్‌.

Ee Kathalo Patralu Kalpitam Second Song Launch:

<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large XcVN5d tw-ta" dir="ltr">Ee Kathalo Patralu Kalpitam Second Song Launch by YS Sharmila</pre>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs