Advertisement
Google Ads BL

టీజర్‌.. మెరిసే మెరిసే..!


మెరిసే మెరిసే టీజర్‌ చాలా బావుంది:  డైరెక్టర్‌ శివ నిర్వాణ

Advertisement
CJ Advs

హుషారు ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా శ్వేతా అవస్తి హీరోయిన్‌గా  కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె.దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న చిత్రం మెరిసే మెరిసే. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ యంగ్‌ డైరెక్టర్‌ శివ నిర్వాణ విడుదల చేశారు. 

ఈ సందర్భంగా.. శివ నిర్వాణ మాట్లాడుతూ మెరిసే మెరిసే టీజర్‌ చూశాను. చక్కటి విజువల్స్‌తో చాలా కూల్‌గా ఉంది. డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌తో హీరో దినేష్‌ తేజ్‌, హీరోయిన్‌ శ్వేతా అవస్తి తమదైన మార్కుని క్రియేట్‌ చేసుకున్నారు. డైరెక్టర్‌ పవన్‌ కుమార్‌ తొలి చిత్రమే అయినా సినిమాను చక్కగా తెరకెక్కించాడని టీజర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. కచ్చితంగా మెరిసే మెరిసే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను అన్నారు. 

కార్తీక్ కొడగండ్ల సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలకు సూపర్స్‌ రెస్పాన్స్‌ వచ్చింది. పెళ్లిచూపులు ఫేమ్ నగేశ్ బానెల్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందించారు. పాటలు, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. 

నటీనటులు: దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, శశాంక్, నానాజీ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు: బ్యానర్: కొత్తూరి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ర‌చ‌న‌, దర్శకత్వం: పవన్ కుమార్. కె, కెమెరామెన్:  నగేష్ బన్నెల్

సంగీతం: కార్తిక్ కొడగండ్ల, సినిమాటోగ్ర‌ఫీ: న‌గేశ్ బానెల్‌, ఎడిట‌ర్‌:  మ‌హేశ్‌, నిర్మాత: వెంకటేష్ కొత్తూరి.

Merise Merise Movie Teaser: https://youtu.be/-biGV0xoKlI

Merise Merise Movie Teaser Release :

<span>I Really Loved The Teaser Of Merise Merise -Shiva Nirvana</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs