Advertisement
Google Ads BL

క్షణ క్షణం ఫస్ట్ లుక్!


క్షణ క్షణం ఫస్ట్ లుక్ ని లాంఛ్ చేసిన డైరెక్టర్ మారుతి

Advertisement
CJ Advs

మన మూవీస్ బ్యానర్ లో ఉదయ్ శంకర్  జియా శర్మ హీరో హీరోయిన్లుగా కార్తిక్ మేడికొండ దర్శకత్వంలో నిర్మించిన సినిమా క్షణ క్షణం. టైటిల్ కి తగ్గట్టుగానే ఆద్యంతం ఉత్కంఠంగా సాగే ఈ మూవీ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను మెప్పిస్తుంది. డార్క్ కామెడీ జానర్ లో సాగే ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దం అవుతుంది. దర్శకుడు మారుతి  క్షణ క్షణం ఫస్ట్ లుక్ ని లాంఛ్ చేసారు. సినిమా కాన్సెప్ట్ ని తెలుసుకొని టీంని అభినందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ఆటగదరా శివ ఫేమ్ ఉదయ్ శంకర్ నటించిన క్షణ క్షణం ఫస్ట్ లుక్ ని లాంఛ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సస్పెన్స్, డార్క్ కామెడీ జానర్ సినిమాలను ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తున్నారు. ఈ జానర్ సినిమాలు చూసే ప్రేక్షకుల పర్సంటేజ్ బాగా పెరిగింది. సినిమా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. క్షణ క్షణం టైటిల్ కు తగట్టుగానే సినిమా కూడా చాలా ఉత్కఠంగా సాగుతుందని తెలిసింది. దర్శకుడు కార్తిక్ కు, హీరో ఉదయ్ శంకర్ కి మంచి విజయం ఈసినిమా అందించాలని కోరుకుంటున్నాను. కొత్త తరహా సినిమాలను ప్రేక్షకుల ఆదరణ చాలా బాగుంది. అలాంటి సినిమాలను నేను బాగా ఇష్ట పడతాను. ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి విజయం అందించాలని కోరుకుంటున్నాను అన్నారు. 

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. మా సినిమా ఫస్ట్ లుక్ ని లాంఛ్ చేసిన మారుతి గారికి ధన్యవాదాలు. సినిమా కాన్సెప్ట్ తెలుసుకొని ఆయన అభినందించడం మాకు చాలా ఆనందం కలిగించింది. మొదటి సినిమా నుండి  కాన్సెప్ట్ ఓరియంటెండ్  స్ర్కిప్ట్ లతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. క్షణ క్షణం తప్పకుండా మా టీంకి పెద్ద సక్సెస్ అందిస్తుందనే నమ్మకం ఉంది. డార్క్ కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. పాటలు బాగా వచ్చాయి. ప్రేక్షకులు కొత్త తరహా సినిమాలను ఆదరిస్తున్నారు.  మా సినిమా ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ నందిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.

దర్శకుడు కార్తిక్ మేడికొండ మాట్లాడుతూ.. కొత్త వాళ్ళను ప్రోత్సహించడంలో మారుతిగారు ముందుంటరనే మాట చాలా సార్లు విన్నాను. ఇప్పుడు ఎక్స్ పీరియన్స్ చేసాను. మా సినిమా ఫస్ట్ లుక్ లాంఛ్ చేసినందుకు ధన్యవాదాలు. మా కాన్సెప్ట్ తెలుసుకొని ఆయన మెచ్చుకున్న తీరు మాకు చాలా కాన్ఫిడెన్స్ నిచ్చింది. క్షణ క్షణం ప్రేక్షకుల్ని ఎక్కడా రిలాక్స్ కానివ్వదు. పాటలు చాలా బాగా వచ్చాయి. సిట్యువేషనల్ గా వచ్చే పాటలు సినిమా మూడ్ ని మరింత ఎలివేట్ చేస్తాయి. చాలా రియలిస్టిక్ గా సినిమాను మలిచాము. పాత్రలకు చాలా తొందరగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ప్రతి పాత్ర చాలా సహాజంగా ఉంటుంది. మా ప్రయత్నానికి ప్రేక్షకుల ఆదరణ ఉంటుందనే నమ్మకం ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము అన్నారు. ఉదయ్ శంకర్ ,జియాశర్మ హీరోహీరోయిన్లు గా నటించే ఈసినిమా లో శ్రుతిసింగ్ మ్యూజిక్ దర్శకుడు కోటి, రఘుకుంచె, రవి ప్రకాశ్, గిఫ్టన్ ఇతర ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.

టెక్నీషియన్స్: డిఓపి: కె. సిద్దార్ద్ రెడ్డి, మ్యూజిక్: రోషన్ సాలూర్, ఎడిటర్: గోవింద్ దిట్టకవి, పి.ఆర్. ఓ: జియస్ కె మీడియా,  నిర్మాతలు: డాక్టర్ వర్లు, మన్నం  చంద్ర మౌళి  దర్శకుడు: మేడికోండ కార్తిక్.

KSHANA KSHANAM Movie First Look:

<span>KSHANA KSHANAM Movie First Look Released by Dir Maruthi</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs