Advertisement
Google Ads BL

ఆశిష్ గాంధీ 'ఉనికి' కోసం!


ఆశిష్ గాంధీ, చిత్ర శుక్ల కాంబినేషన్ లో  ఎవర్ గ్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ చిత్రం ఉనికి.

Advertisement
CJ Advs

నాటకం ఫేమ్ ఆశిష్ గాంధీ, రంగుల రాట్నం ఫేమ్ చిత్ర  శుక్లల కాంబినేషన్ లో  రాజ్‌కుమార్  బాబీ దర్శకత్వంలో ఎవర్ గ్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మిస్తున్న చిత్రానికి ఉనికి అనే టైటిల్ ని ఖరారు చేశారు.  ఈ చిత్రం టైటిల్ ని, ఫస్ట్ ఎటాక్ పోస్టర్ ని రాక్ స్టార్ మంచు మనోజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాతలు బాబీ ఏడిద ,రాజేష్ బొబ్బూరి మాట్లాడుతూ-  మా చిత్రం ఫస్ట్ ఎటాక్ పోస్టర్ ని ఆవిష్కరించిన రాక్ స్టార్ మంచు మనోజ్ గారికి చాలా థాంక్స్. ఈప్రపంచంలో ఏ మనిషైనా తన ఉనికి  చాటుకోవడం కోసం తపిస్తాడు. ముఖ్యంగాఅననుకూల పరిస్థితులు, అడ్డంకులు, అవరోధాలు ఎదురైనప్పుడు ఇంకా ఎక్కువగా ఉనికి కోసం తపిస్తారు. ఓ సామాన్య మధ్య తరగతి యువతికి అలాంటి పరిస్థితులుఎదురైనప్పుడు తన ఉనికి నిలుపు కోవడం కోసం ఎలా పోరాడింది అనేది ఈ చిత్రం ప్రధాన కథాంశం. రాజమండ్రి సబ్-కలెక్టర్ అంజలి అనుపమ ని చూసినప్పుడు కలిగిన ఆలోచనతో ఈ స్క్రిప్ట్  తయారు చేయడం జరిగింది. అలాగని ఇదేమి ఆమె రియల్ స్టోరీకాదు. ఇందులో ప్రతి సన్నివేశం కొత్తగాను, ఆసక్తికరం గాను అనిపిస్తుం ది. ఈ రోజుతో చిత్రీకరణ మొత్తం  పూర్తయింది. 45 రోజుల పాటు రెండు షెడ్యూల్స్ లో చిత్రీకరించాం. ఉభయ గోదావరి జిల్లాలోని అందమైన ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఇందులో మొత్తం మూడు పాటలున్నాయి. ఈ సమ్మర్ కి రీలీజ్ ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. 

టీఎన్ఆర్, రంగస్థలం నాగ మహేష్, అప్పాజీ అంబరీష, ప్రభావతి, టిక్ టాక్ దుర్గారావు, పద్మశ్రీ, బండి స్టార్ కిరణ్ తదితరులు  ఈ చిత్ర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కథ: బాబీ ఏడిద,  రచన: సరదా శ్యామ్, ఛాయాగ్రహణం-కూర్పు: హరికృష్ణ, సంగీతం: పి. ఆర్ (పెద్దపల్లి రోహిత్), కాస్ట్యూమ్స్ - రూప రేఖ గుత్తి, సహనిర్మాత: అడ్డాల రాజేష్, నిర్మాత‌లు: బాబీ ఏడిద‌, రాజేష్ బొబ్బూరి, ద‌ర్శ‌క‌త్వం: రాజ్‌కుమార్ బాబీ. 

Uniki Movie title has been finalized:

Uniki Movie&nbsp;<span>Release plan for summer</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs