Advertisement
Google Ads BL

టుడే మూవీ అప్ డేట్స్


                                             జులై 2న అడివిశేష్ మేజ‌ర్‌.

Advertisement
CJ Advs

మేజర్ చిత్రం విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తూ 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ఉన్ని కృష్ణన్ గెటప్ లో ఉన్న  అడివి శేష్ పోస్టర్ విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ఈ చిత్రాన్ని జూలై 2న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూ  విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో అడివిశేష్ తుపాకీ పట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు.

అడవి శేష్ పుట్టినరోజు సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన ఈ క్రేజి ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రం నుండి రిలీజ్‌చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్  ఈ ప్రాజెక్ట్ పై అంచ‌నాల‌ను భారీగా పెంచుతూ వ‌చ్చింది.  

26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ చిత్రం తెరకెక్కుతోంది.  అతను చనిపోయిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క ఆత్మను సంగ్రహించి మేజర్ సందీప్ జీవితాన్నిసెల‌బ్రేట్ చేయ‌డ‌మే ఈ చిత్రం యెక్క ముఖ్య ఉద్దేశం.

తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన మేజర్ చిత్రీక‌ర‌ణ అతి త్వ‌ర‌లో పూర్తికానుంది. 

 

            యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేసిన ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు టీజ‌ర్‌

యంగ్ హీరో సుశాంత్ అల.. వైకుంఠ‌పుర‌ములో చిత్రంలో చేసిన పాత్ర‌తో ఇటు విమ‌ర్శ‌కుల‌, అటు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఆ మూవీ త‌ర్వాత ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న చిత్రం ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు. ఎస్‌. ద‌ర్శ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫిల్మ్‌ను ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్ల‌పై ర‌విశంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీష్ కోయ‌ల‌గుండ్ల నిర్మిస్తున్నారు. నో పార్కింగ్ అనేది ట్యాగ్ లైన్‌. మీనాక్షి చౌధ‌రి హీరోయిన్‌.

శుక్ర‌వారం ఈ మూవీ టీజ‌ర్‌ను యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేశారు. 1 నిమిషం 30 సెక‌న్ల నిడివి వున్న ఈ టీజ‌ర్ చూశాక త‌ప్ప‌కుండా సినిమాని చూడాల‌నే క్యూరియాసిటీని ఆడియెన్స్‌లో క‌లిగిస్తోంది. అంత ఉత్కంఠ‌భ‌రితంగా టీజ‌ర్ ఉంది. టైటిల్‌లో స‌జెస్ట్ చేసిన‌ట్లు నో పార్కింగ్ ప్లేస్‌లో త‌న కొత్త రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను హీరో సుశాంత్‌ పార్క్ చేస్తే, కాల‌నీవాసులు దాన్ని ధ్వంసం చేసిన‌ట్లు టీజ‌ర్‌ను బ‌ట్టి తెలుస్తోంది. అక్క‌డ బైక్‌ను హీరో పార్క్ చేయ‌డం వెనుక కూడా ఏదో క‌థ ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. న‌వ్వులు పండించే బాధ్య‌త‌ను వెన్నెల కిశోర్ తీసుకున్నార‌ని టీజ‌ర్ తెలియ‌జేస్తోంది. అంద‌మైన ప్రేమ‌క‌థ‌కు మిస్ట‌రీ ఎలిమెంట్‌ను జోడించి డైరెక్ట‌ర్ ద‌ర్శ‌న్ ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు చిత్రాన్ని మ‌లిచారు.

ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు బ్యాగ్రౌండ్ స్కోర్‌, ఎం. సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకి ఎస్సెట్స్ అవుతాయ‌నే న‌మ్మ‌కం టీజ‌ర్ క‌లిగిస్తోంది. సుశాంత్ కెరీర్‌లోని బెస్ట్ ఫిలిమ్స్‌లో ఒక‌టిగా ఈ సినిమా నిలుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

తారాగ‌ణం: సుశాంత్‌, మీనాక్షి చౌధ‌రి, వెంక‌ట్‌, వెన్నెల కిశోర్‌, ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గోమ‌టం, ఐశ్వ‌ర్య‌, నిఖిల్ కైలాస‌, కృష్ణ‌చైత‌న్య‌, హ‌రీష్‌

 

               విక్ట‌రీ వెంక‌టేష్ నార‌ప్ప‌ షూటింగ్ పూర్తి,  మే14న వ‌రల్డ్‌వైడ్‌గా విడుద‌ల‌

సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి,  వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరుగా చేసుకున్న వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న భారీ చిత్రం నారప్ప. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా తెలుగు వారికి  చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన గ్లిమ్స్‌, పోస్ట‌ర్లకు మంచి స్పంద‌న వ‌చ్చింది. విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన నార‌ప్ప టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న ఈ మూవీ షూటింగ్ జ‌న‌వ‌రి 31తో పూర్తికానుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి  ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మే 14 ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌. విక్టరీ వెంకటేష్‌, ప్రియమణి, కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు

 

                                 నేనెవరు అంటున్న కోలా బాలకృష్ణ!

తెలుగు-తమిళ భాషల్లో సుప్రసిద్ధులైన ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ నటిస్తున్న విభిన్న కథా చిత్రం నేనెవరు. కౌశల్ క్రియేషన్స్ పతాకంపై.. యువ ప్రతిభాశాలి నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు.

కోలా బాలకృష్ణకు జంటగా సాక్షి చౌదరి నటిస్తున్న ఈ చిత్రంలో తనిష్క్ రాజన్-గీత్ షా సహాయ పాత్రలు పోషిస్తుండగా... బాహుబలి ప్రభాకర్ విలన్. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు.లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. కోలా భాస్కర్ ఎడిటింగ్ చేసిన చివరి చిత్రమిది. త్వరలో టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఆదిత్య మ్యూజిక్ ఆడియో హక్కులు సొంతం చేసుకున్న ఈ చిత్రానికి కెమెరా: సామల భాస్కర్, ఫైట్స్: రియల్ సతీష్, పి.ఆర్.ఓ: ధీరజ్ అప్పాజీ, పబ్లిసిటీ డిజైన్స్: వాల్స్ అండ్ ట్రెండ్స్, పోస్ట్ ప్రొడక్షన్: ప్రసాద్ లాబ్స్, ఎడిటింగ్: కోలా భాస్కర్, సంగీతం: ఆర్.జి.సారధి,సహనిర్మాతలు: పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి, నిర్మాతలు: భీమినేని శివప్రసాద్- తన్నీరు రాంబాబు, దర్శకత్వం: నిర్ణయ్ పల్నాటి

 

>ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్, వైజ‌యంతీ మూవీస్ సినిమాకి డానీ సాంచెజ్-లోపెజ్‌, మిక్కీ జె. మేయ‌ర్‌

ప్ర‌భాస్‌, దీపిక పదుకొణె జంట‌గా ఒక అద్భుత‌మైన సినిమా అనుభ‌వాన్ని ఇచ్చేందుకు అగ్ర‌శ్రేణి నిర్మాణ సంస్థ‌ వైజ‌యంతీ మూవీస్ సిద్ధ‌మ‌వుతోంది. మ‌హాన‌టితో తెలుగుచిత్ర‌సీమ‌లోని ప్ర‌తిభావంతులైన ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు పొందిన నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. యూనివ‌ర్స‌ల్ అప్పీల్ ఉన్న ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌ను లివింగ్ లెజెండ్ అమితాబ్ బ‌చ్చ‌న్ చేయ‌నున్నారు.

వైజయంతీ మూవీస్‌, నాగ్ అశ్విన్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన మ‌హాన‌టి ప‌లు జాతీయ‌, అంత‌ర్జాతీయ పుర‌స్కారాల‌ను అందుకుంది. ఆ చిత్రానికి తెర వెనుక హీరోలుగా నిలిచిన ఇద్ద‌రు వ్య‌క్తులు ఇప్పుడు ప్ర‌భాస్‌, దీపిక‌, నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ కాంబినేష‌న్ చిత్రానికి ప‌నిచేయ‌డానికి రెడీ అవుతున్నారు. వారిలో ఒక‌రు సినిమాటోగ్రాఫ‌ర్ డానీ సాంచెజ్‌-లోపెజ్ కాగా, మ‌రొక‌రు మ్యూజిక్ డైరెక్ట‌ర్ మిక్కీ జె. మేయ‌ర్‌.

ఈ విష‌యాన్ని శుక్ర‌వారం త‌న అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా వైజ‌యంతీ మూవీస్ సంస్థ ప్ర‌క‌టించింది. Proudly presenting our heroes behind the screen. Welcome @dancinemaniac and @MickeyJMeyer onboard our #PrabhasNagAshwin Project. అంటూ ట్వీట్ చేసింది.

మ‌హాన‌టి చిత్ర విజ‌యంలో మిక్కీ జె. మేయ‌ర్‌, డానీ సాంచెజ్‌-లోపెజ్ పోషించిన పాత్ర ఎంతో ఉంది. అందుకే ఆ ఇద్ద‌రినీ ఈ చిత్రానికి ఎంచుకున్నారు డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్‌.

డ్రీమ్ క్యాస్ట్ అన‌ద‌గ్గ అమితాబ్ బ‌చ్చ‌న్‌, ప్ర‌భాస్‌, దీపిక పదుకొణె లాంటి నేటి భార‌తీయ సినిమా బిగ్గెస్ట్ స్టార్స్‌, సినీ మాంత్రికుడు అన‌ద‌గ్గ నాగ్ అశ్విన్ (మ‌హాన‌టి ఫేమ్‌) లాంటి డైరెక్ట‌ర్ క‌ల‌యిక‌లో రానున్న సినిమా కావ‌డంతో ఇదివ‌ర‌కెన్న‌డూ చూడ‌ని ఓ సెల్యులాయిడ్ దృశ్య కావ్యాన్ని సినీ ప్రియులు ఆశించ‌వ‌చ్చు. 2022లో ఈ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది.

 

                             డా. మోహ‌న్‌బాబు స‌న్నాఫ్ ఇండియా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

భారతీయ సినిమా యొక్క అత్యంత బహుముఖ నటులలో ఒకరైన డాక్టర్ మోహన్ బాబు చిత్రనిర్మాణంలో ప్రతి విభాగం గురించి లోతైన జ్ఞానం కలిగి ఉన్నారు. తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సన్నాఫ్ఇండియాకు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు.

ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజు విడుద‌ల‌చేశారు మేక‌ర్స్‌. ఈ పోస్ట‌ర్లో  డాక్టర్ మోహన్ బాబు మెడ‌లో రుద్రాక్ష మాల ధరించి ఇంటెన్స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. మోహన్ బాబు కొత్త హెయిర్‌డోతో పూర్తిగా భిన్నమైన గెటప్‌లో క‌నిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం గడ్డం కూడా పెంచుకున్నారు ఇన్ని దశాబ్దాల సినీ కెరీర్‌లో మోహన్ బాబు గారికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లుక్ అని చెప్పొచ్చు. ఈ  ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ చిత్రంపై అంచ‌నాలను మరో లెవ‌ల్‌కి పెంచింది.

టాలీవుడ్‌లో ఇంత‌వ‌ర‌కూ రాని ఒక విభిన్న క‌థా క‌థ‌నాల‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి  డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.  శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్,  24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విష్ణు మంచు భార్య, మోహన్ బాబు కోడ‌లు విరానికా మంచు ఈ చిత్రంతో స్టైలిస్ట్‌గా మారారు. ఆమె మోహన్ బాబును పూర్తిగా కొత్త అవతారంలో చూపించారు. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళ‌యరాజా సంగీతం అందింస్తుండ‌గా సర్వేష్ మురారి ఛాయాగ్రాహకుడు. ఈ చిత్రానికి మాట‌లు డైమండ్ ర‌త్న‌బాబు, తోట‌ప‌ల్లి సాయినాథ్‌. సుద్దాల అశోక్‌తేజ లిరిక్స్ అందిస్తున్నారు. గౌతంరాజు ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తుండ‌గా చిన్నా ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 

 

Today Movie updates:

Major release date, Narappa release date, Son of India Look, Ichata Vahanamulu niluparadu teaser update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs