Advertisement
Google Ads BL

సుకుమార్ రిలీజ్ చేసిన అర్దశతాబ్దం టీజర్


కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో  రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టికిరన్ రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అర్ద శతాబ్ధం. నవీన్ చంద్ర, సాయి కుమార్ గెటప్స్ కి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ని ఇటీవ‌ల దగ్గుబాటి రానా రిలీజ్ చేశారు. ప్రేక్షకుల్లో దీనికి సూపర్ క్రేజ్ వచ్చింది. తాజాగా బ‌తుక‌మ్మ సంబురాల‌ సంద‌ర్భంగా పుష్ప‌ పాత్ర లుక్ ని ప్ర‌ముఖ న‌టి శ్రీ‌దివ్య లాంచ్ చేశారు. తాజాగా అర్దశతాబ్దం టీజర్ ను సెన్సిబుల్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేశారు..  

Advertisement
CJ Advs

అర్ధశతాబ్దం టీజర్ లో.. న్యాయం ధర్మం అవుతుంది కానీ.. ధర్మం ఎల్లపుడు న్యాయం కాలేదు. యుద్ధమే ధర్మం కానప్పుడు.. మరి యుద్ధాలెక్కడివి. ఈ స్వాతంత్య్ర దేశంలో గణతంత్రం ఎవడికో, ఎందులకో, దేనికో ఈ విశాల భారతానికి అఖండ రాజ్యం అంటూ టీజర్ ని ఎండ్ చేసారు. 

సెన్సిబుల్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ..అర్దశతాబ్దం పవర్ ఫుల్ టైటిల్. చాలా బాగుంది. టీజర్ చాలా ఇంట్రెస్టింగా ఉంది. రవీంద్ర టేకింగ్ ఎక్స్ లెంట్ గా ఉంది. ఈ సినిమా సక్సెస్ అయి నిర్మాతలకు మంచి లాభాలు తేవాలని .. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్  వ‌చ్చింది. సుకుమార్ గారు మా సినిమా టీజర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం ఉంది.. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.. అన్నారు

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: రిషిత శ్రీ క్రియేషన్స్ 

రచన,దర్శకత్వం: రవీంద్ర పుల్లే,

నిర్మాతలు: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ,

డిఓపి: అష్కర్ (బాయ్ ఫేమ్),

సంగీతం: నౌఫల్ రాజా (ఎ.ఐ.ఎస్)

ఆర్ట్: సుమిత్ పటేల్,

కాస్ట్యూమ్స్: పూజిత తాడికొండ

ఎడిటర్: జె. ప్రతాప్ కుమార్,

పాటలు: రెహమాన్,

స్టాంట్స్: అంజి,

పిఆర్ఓ: సాయి సతీష్. రాంబాబు పర్వతనేని.

Ardhasathabdham Teaser by Sukumar:

Ardhasathabdham Teaser by Sukumar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs