Advertisement
Google Ads BL

తనిఖీ కేంద్రం 1995 పోస్టర్స్ రిలీజ్


గణతంత్రం దినోత్సవం సందర్బంగా తనిఖీ కేంద్రం 1995 పోస్టర్స్ రిలీజ్ చేసిన దర్శకుడు మారుతి..!!

Advertisement
CJ Advs

దేవి సినిమా ద్వారా బాలనటుడుగా అందరికి సుపరిచితమై, సంక్రాంతికి విడుదలైన విజయ్ మాస్టర్ చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్రన్ హీరోగా నటిస్తున్న చిత్రం తనిఖీకేంద్రం 1995. తెలుగులో మొదటి క్రౌడ్ ఫండెడ్ మూవీ అంతర్వేదం చిత్ర దర్శకుడు చందిన రవి కిషోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హర్షిత ప్రొడక్షన్స్ మరియు ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రం మొదటి పోస్టర్ డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్బంగా..

ప్రముఖ దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. పోస్టర్ చాలా విభిన్నంగా ఉందని, ఇలాంటి సినిమాలు ,ఇలాంటి యువ దర్శకులు పరిశ్రమకి చాలా అవసరం. సినిమా సక్సెస్ అయి యూనిట్ అందరికీ మంచి పేరు రావాలి.. అన్నారు.

చిత్ర దర్శకుడు చందిన రవి కిషోర్ మాట్లాడుతూ.. 1995లో జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. సినిమా ఖచ్చితంగా ప్రజలని అలరిస్తుంది. ఫిబ్రవరి మొదటి వారంలో టీజర్ విడుదల చేసి.. అతిత్వరలో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.

హీరో మహేంద్రన్ మాట్లాడుతూ.. మాస్టర్ చిత్రంలో విజయ్ సేతుపతి టీనేజ్ రోల్ ఎంత పేరు తెచ్చిందో.. ఈ చిత్రం దానికి పదింతలు గుర్తింపు తెస్తుందనే నమ్మకం ఉంది.. దర్శకుడు రవి కిషోర్ తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. మళ్లీ మళ్లీ.. రవి కిశోర్ చందినతో పని చేయాలని ఉంది.. అన్నారు. 

షజ్ఞ శ్రీవేణున్ హీరోయిన్ గా, బాహుబలి ప్రభాకర్, పలాస ఫేమ్ ఉమా మహేశ్వరావు, జబర్దస్త్ దొరబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శివ కుమార్ దేవరకొండ, సంగీతం: వినోద్ యాజమాన్య, మాటలు: విజయ్ కార్తిక్ చెన్నం, పాటలు; రాంబాబు గోసాల, సీజీ: సంతోష్, పబ్లిసిటీ డిజైనర్: షబ్బీర్ ఆలీ, పీఆర్ఓ; సాయి సతీష్, రాంబాబు పర్వతనేని, నిర్మాతలు: కోటేశ్వరావు గూడేలా, పి.వి.చంద్ర, రచన-దర్శకత్వం; చందిన రవి కిషోర్.

Thaniki Kendram 1995 Posters Launch:

Thaniki Kendram 1995 Posters Launch by Director Maruthi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs