Advertisement
Google Ads BL

నితిన్ లక్ చెక్ చేసుకునే డేట్


ఫిబ్రవరి 19న నితిన్ - చంద్రశేఖర్ ఏలేటి - భవ్య క్రియేషన్స్ ల చిత్రం చెక్ రిలీజ్

Advertisement
CJ Advs

నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ప్రసాద్ నిర్మిస్తున్న  చెక్ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 19న గ్రాండ్ రిలీజ్చేస్తున్నామని నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ  జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్థ్రిల్లర్ ఇది. ఈ మధ్యకాలంలో ఈ నేపథ్యంలో సినిమా రాలేదు. కచ్చితంగా ప్రేక్షకులకు కొత్తఅనుభూతిని ఇచ్చే కాన్సెప్ట్ ఇది. ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలాచేరుకున్నాడన్నది ఈ చిత్రం ప్రధాన కథాంశం. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. నితిన్- చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులోఉంటాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ కి చక్కటి స్పందన లభించింది. ఇందులోకథానాయికలు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ పాత్రలు కూడా చాలాఆసక్తికరంగా ఉంటాయి అని తెలిపారు.

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరితదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణి మాలిక్, ఛాయాగ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్  , ఆర్ట్ : వివేక్అన్నామలై  , ఎడిటింగ్ : అనల్ అనిరుద్దన్ , ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి , నిర్మాత :  వి.ఆనంద ప్రసాద్,

కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి.

Nithin Check Movie Release date locked:

Nithin Check release on February 19th 2021
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs