Advertisement
Google Ads BL

ఉగాదిని సెట్ చేసుకున్న నాని


ఏప్రిల్ 16న విడుద‌ల‌వుతున్న నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ‌, షైన్‌స్క్రీన్స్ ల ట‌క్ జ‌గ‌దీష్

Advertisement
CJ Advs

నేచురల్ స్టార్ నాని  హీరోగా నటించిన టక్ జగదీష్ 2021లో   ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. నిన్నుకోరి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల  క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది.

క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ట‌క్ జ‌గ‌దీష్ ఫ‌స్ట్‌లుక్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.  లేటెస్ట్‌గా ఈ మూవీ విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తూ నానిని ఇంత‌కు ముందెన్న‌డు చూడ‌నంత క్లాస్‌లుక్‌తో స‌రికొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేశారు మేక‌ర్స్. కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్ళికొడుకు గా రెడి అవుతున్న నాని లుక్ ఆకట్టుకుంటుంది.

టక్ జగదీష్ ఏప్రిల్ 16 న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  తెలుగు సంవ‌త్స‌రాది అయిన ఉగాది పండగ ఏప్రిల్ 13..పండ‌గ మూడు రోజుల తరువాత టక్ జగదీష్ థియేటర్లకు రావడంతో మ‌ళ్లీ సెల‌బ్రేష‌న్స్ మొద‌లుకానున్నాయి.  

రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని  షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

Tuck Jagadish To Release On 16th April 2021:

<span>Nani, Shiva Nirvana, Shine Screens Tuck Jagadish To Release On 16th April 2021..</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs