Advertisement
Google Ads BL

కేజీయఫ్‌ చాప్టర్ 2 ఫస్ట్‌ విజువల్


ప్రేక్షకాభిమానులకు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్‌ న్యూ ఇయర్‌ విషెష్‌

Advertisement
CJ Advs

ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న ప్యాన్ ఇండియా మూవీస్‌లో కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2 ఒక‌టి. క‌న్న‌డ రాక్‌స్టార్ యష్ హీరోగా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్యాన్‌ ఇండియా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో సినిమాల‌ను నిర్మిస్తోన్న హోంబాలే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

 హీరో యష్ పుట్టినరోజున కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2 టీజ‌ర్‌ను 2021, జ‌న‌వ‌రి 8 ఉదయం 10 గంటల 18 నిమిషాలకు విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. కొత్త ఏడాదిలో అందరం అడుగు పెట్టాం. ఈ సందర్భంగా 

హోంబాలే ఫిలింస్‌ అధినేత విజయ్‌ కిరగందూర్‌ మాట్లాడుతూ ప్రేక్షకాభిమానులకు కొత్త ఏడాది 2021లో అంతా మంచే జరగాలని కోరుకుంటూ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మాతో కలిసి వారు చేసిన ప్రయాణం, వారు అందించిన మధుర జ్ఞాపకాలను మరచిపోలేం. కేజీయఫ్‌ చాప్టర్‌1 ను  ఆదరించినందుకు ప్రేక్షకాభిమానులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఏడాదిలో కేజీయఫ్‌ చాప్టర్‌2 తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఇదే సందర్భంలో యష్ పుట్టినరోజు జనవరి 8న ఉదయం 10 గంటల 18 నిమిషాలకు కేజీయఫ్‌ చాప్టర్ 2  ఫస్ట్‌ విజువల్‌ను మా హోంబాలే ఫిలింస్‌ యూ ట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా విడుదల చేస్తున్నాం. మీ ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు ఇలాగే మాపై ఉంటాయని ఆశిస్తున్నాం అన్నారు.

KGF Chapter 2 Teaser on January 08, 2021 :

KGF Chapter 2 Teaser on January 08, 2021  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs