Advertisement
Google Ads BL

రీతువర్మకు ‘వరుడు కావలెను‘


ప్రచారచిత్రం లో చూడ ముచ్చటగా ఉన్న నాగ శౌర్య, రీతువర్మ ల జంట

Advertisement
CJ Advs

నాగ శౌర్య, రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  చిత్రం వరుడు కావలెను ప్రచారచిత్రం విడుదల. ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య, నాయిక రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రానికి వరుడు కావలెను అనే పేరును నిర్ణయించిన విషయం విదితమే. ఈ మేరకు అధికారిక ప్రకటన చేస్తూ దీనికి సంభందించి ఓ ఆకట్టుకునే అందమైన వీడియో ను కూడా ఇటీవల  విడుదల చేశారు. ఈ వీడియో లో నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపించారు. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తేవటమే కాదు ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు కూడా  లభించాయి. వరుడు కావలెను అనేపేరు చిత్ర కథ కు పూర్తిగా సరైనదన్ననమ్మకాన్నివ్యక్తం చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. ఈ సందర్భంగా ఓ ప్రచారచిత్రం విడుదల చేశారు.ఈ చిత్రంలో చూడ ముచ్చటగా  నాగ శౌర్య, రీతువర్మ ల జంట కనిపిస్తుంది. హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. చిత్ర నాయకా, నాయికలతో పాటు  ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది అని తెలుపుతూ చిత్ర యూనిట్ తరపున ప్రేక్షకులకు, మీడియా వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్య దేవర నాగవంశీ, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య.

Naga Shourya and Ritu Varma looked very cute in the poster:

<span>Varudu Kaavalenu team wsihes you all a very Happy New Year</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs