Advertisement
Google Ads BL

మైల్స్ ఆఫ్ లవ్ దిల్ రాజు చె 'గగనము దాటే'


మైల్స్ ఆఫ్ లవ్ చిత్రము నుండి 'గగనము దాటే' లిరికల్ విడియో సాంగ్ రిలీజ్ చేసిన హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు!

Advertisement
CJ Advs

హుషారు వంటి సూపర్ హిట్ చిత్రంలో వన్ ఆఫ్ ది హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్న అభినవ్ మేడిశెట్టి సోలో హీరోగా నటిస్తున్న చిత్రం మైల్స్ ఆఫ్ లవ్ కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నందన్ దర్శకత్వంలో రాజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ కామ్  బాక్డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్య పసుపులేటి హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్ ఆర్ ధ్రువన్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయి రెండు మిలియన్స్ వ్యూయర్ షిప్ సంపాదించుకొని సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది..ఇదిలా ఉండగా చిత్రంలోని గగనము దాటే వీడియో సాంగ్ ని డిసెంబర్ 30న హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ప్రముఖ గాయకుడు యశస్వి కొండేపూడి ఆలపించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలయింది.

హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ. హుషారులో యాక్ట్ చేసిన అభినవ్, రమ్య కాంబినేషన్ లో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లో మా రాజిరెడ్డి నిర్మిస్తున్న మైల్స్ ఆఫ్ లవ్ చిత్రంలో ఫస్ట్ సాంగ్ గగనము దాటే సాంగ్ లాంచ్ చేసాను. యశస్వి ఫెంటాస్టిక్ గా పాడాడు. విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి.. డైరెక్టర్ నందన్ సాంగ్ పిక్చరైజేషన్ బాగా చిత్రీకరించారు. ఈ సినిమా సక్సెస్ అయి మా రాజిరెడ్డి ఇంకా మరిన్ని మంచిత్రాలు తియ్యాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

దర్శకుడు నందన్ మాట్లాడుతూ.. ప్రెజెంట్ యూత్ కి నచ్చే ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రామ్ కామ్ బాక్డ్రాప్ లో మైల్స్ ఆప్ లవ్ చిత్రాన్ని రూపొందించాం.. నన్ను నమ్మి కథపై నమ్మకంతో మా నిర్మాత రాజిరెడ్డి గారు ఈ చిత్రాన్ని ఎక్కడా వెనకాడకుండా రిచ్ గా నిర్మించారు. అభినవ్, రమ్య పెయిర్ చాలా బాగా కుదిరింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కోపరేట్ చేసి సినిమా బాగా రావడానికి హెల్ప్ చేశారు. ఆల్ రెడీ  డైరెక్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమోకి రెండు మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ధ్రువన్ ఎక్సలెంట్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ దిల్ రాజు గారు లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. రవి మణి కె.నాయుడు అందించిన విజువల్స్ కనుల పండగా ఉంటుంది. జనవరిలో టీజర్, ట్రైలర్ రిలీజ్ చేస్తాం అన్నారు. 

నిర్మాత రాజిరెడ్డి మాట్లాడుతూ.. మా దర్శకుడు నందన్ డిఫరెంట్ కాన్సెప్టుతో మైల్స్ ఆఫ్ లవ్ చిత్రాన్ని అందరికీ నచ్చేవిధంగా తెరకెక్కించాడు.. ధ్రువన్ మ్యూజిక్, రవిమణి కెమెరా విజువల్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి. దిల్ రాజు గారు, బెక్కం వేణుగోపాల్ మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. వారికి మా థాంక్స్. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా; రవిమణి కె.నాయుడు, సంగీతం; ఆర్.ఆర్.ధ్రువన్, ఎడిటర్; బి.నాగిరెడ్డి, రచన-దర్శకత్వం; నందన్, నిర్మాత; రాజిరెడ్డి.

Dil Raju released Miles of Love lyrical video song:

Miles of Love movie Songs Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs