Advertisement
Google Ads BL

రామ్ చరణ్ కు కరోనా!


మొన్న చిర్నజీవికి నేడు కొడుకు రామ్ చరణ్ కు కరోనా ఎవ్వరిని వదలడం లేదు.  సాధారణ ప్రజానీకం నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు ఎవరినీ వడలదం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకోనందు వల్లే  వైరస్ ఏదొక విధంగా అటాక్ చేస్తూనే ఉంది. కరోనాకు వ్యాక్సిన్ ప్రయోగాలు టెస్ట్ రన్ లు జరుగుతున్న ఈ తరుణంలో కరోనా కూడా కొత్తగా రూపాంతరం చెంది జనాన్ని భయపెడుతూనే వుంది . ఈ క్రమంలో మన దేశంలో కూడా ప్రతి రోజు కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోగా.. మరికొంత మంది మృతి చెందారు. 

Advertisement
CJ Advs

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని చరణ్ స్వయంగా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఇక ఎప్పుడు అభిమానుల్లో కలవరం మొదలయ్యింది. చిరంజీవికి కరోనా వచ్చి వెంటనే నెగటివ్ వచ్చింది.. అలాగే రాంచరణ్ కూడా వెంటనే తగ్గిపోతుంది అని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం తనకి ఎలాంటి సింటమ్స్ లేవని.. అయినప్పటికీ రాంచరణ్ మాత్రం హోమ్ క్వారంటైన్ లో ఉంటానని ప్రకటించాడు. అలాగే తనని కలిసిన ఫ్యామిలీ మెంబెర్స్ ని టెస్ట్ లు చేయించుకోవాలని ప్రకటించాడు. మరి రామ్ చరణ్ కి కరోనా రావడంతో ఇప్పుడు RRR షూటింగ్ కి బ్రేకులు వేస్తారో లేదంటే రాజమౌళి మిగతా వాళ్లతో షూటింగ్ కానిచ్చేస్తాడో చూడాలి. 

Ram Charan Testing With Corona Positive:

Ram Charan Testing With Corona Positive
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs