Advertisement
Google Ads BL

శివ కందుకూరి 4వ సినిమా 'చేతక్ శీను'


శివ కందుకూరి  4వ సినిమా చేతక్ శీను

Advertisement
CJ Advs

చూసీ చూడంగానే చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన శివ కందుకూరి  యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.. ప్రస్తుతం గమనం వంటి డిఫరెంట్ మూవీలో విభిన్నమైన పాత్ర చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2021 ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.. అలాగే శివ కందుకూరి మను చరిత్ర అనే చిత్రం లొ కూడా నటిస్తున్నారు. మను చరిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని, ఇంకా మరొక షెడ్యూల్ మిగిలి ఉంది.. తాజాగా శివ కందుకూరి మరో అల్టిమేట్ కథతో  చేతక్ శీను వంటి వెరైటీ టైటిల్ తో సినిమా చేయబోతున్నారు. ఇది శివ కందుకూరి నాలుగవ చిత్రం గా ఉండబోతొంది.  రవి ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై  ప్రొడక్షన్ నంబర్-1చిత్రంగా, రవి చరణ్ మెరుపో, ప్రతిమ సంయుక్తంగా నిర్మిస్తున్న చేతక్ శీను డిసెంబర్ 25న సంస్థ కార్యాలయంలో  పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. కథనం వంటి హిట్  చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చేతక్ శీను చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సరికొత్త కాన్సెప్ట్ తో ఇప్పటివరకు తెలుగు తెరపై రానటువంటి కథాంశంతో  కామిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 18నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మెలోడీ మాస్టర్ అనూప్ రూబెన్స్ చేతక్ శీను చిత్రానికి అత్యద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. మళ్లీరావా, కరెంట్ తీగ  మొదలగు చిత్రాలకి ఫోటోగ్రఫీని అందించిన సతీష్ ముత్యాల ఈ చిత్రానికి బ్యూటిఫుల్ విజువల్స్ అందించనున్నారు.. అలాగే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఎడిటింగ్ చేసిన ఎం. ఆర్.వర్మ చేతక్ శీను సినిమాకి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్ పాల్గొని చిత్ర యూనిట్ సబ్యులకు శుభాకాంక్షకులు తెలిపారు..

చిత్ర దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ.. ఇది నా రెండవ సినిమా. రాజ్ కందుకూరి గారు ఫస్ట్ కథ విని వెంటనే ఒకే చెప్పారు.. అంతలా ఆయన్ని కథ ఎగ్జైట్ చేసింది. చాలా సలహాలు సూచనలు చెప్పారు.. ఆయన గైడెన్సీతో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేస్తాం. శివతో వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.. అన్నారు. 

హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. రాజేష్ ఫెంటాస్టిక్ స్టోరీ చెప్పారు. చేతక్ శీను వండర్ ఫుల్ టైటిల్.. రాజ్ కాంత్ కథ ఇచ్చారు. చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. రవి, ప్రతిమ గారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.. ఫిబ్రవరి నుండి షూట్ కి వెళ్తున్నాం. అనూప్  మ్యూజిక్, సతీష్ ఫోటోగ్రఫీ సినిమాకి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది.. అన్నారు. 

నిర్మాత రవి చరణ్ మెరుపో మాట్లాడుతూ.. రవి ఫిల్మ్ కార్పొరేషన్ లో ప్రొడక్షన్ నంబర్-1 గా చేతక్ శీను సినిమా క్రిస్మస్, ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. రాజ్ కాంత్ సూపర్బ్ స్టోరీ ఇచ్చారు. చాలా టెమ్టింగ్ గా అనిపించింది. ఈ కథకి శివ అయితే పర్ఫెక్ట్ గా బాగుంటుందని ఒకే చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంత అద్భుతమైన కథకి డైరెక్టర్ ఎవరు అనుకుంటున్న టైంలో రాజేష్ బాగా డీల్ చేస్తాడని కాన్ఫిడెంట్ తో  దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పాము.. ఇట్స్ ఎ కామిక్ థ్రిల్లర్.. ఖచ్చితంగా ఈ సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఫిబ్రవరి 18నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం.. అన్నారు.

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. రీసెంట్ టైమ్స్ లో నేను ఇంప్రెస్ అయిన స్టోరీ ఇది. బేసిగ్గా నాకు థ్రిల్లర్స్ ఇష్టం. పాయింట్ చాలా బాగుంది. జనరల్ గా థ్రిల్లర్స్ ఎంగేజింగ్ గావుంటాయి. చేతక్ శీను లో కంటిన్యూస్ ఎంగాజింగా ఉంటుంది. శివ ఎప్పటినుండో థ్రిల్లర్ మూవీ చేయాలను కుంటున్నాడు. చేతక్ శ్రీను అతనికి నాలుగవ సినిమా. చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు. రాజేష్ మంచి డైరెక్టర్. రవి, ప్రతిమ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఇవాళ మంచి రోజు కాబట్టి పూజ చేశారు. ఫిబ్రవరి 18 నుండి షూటింగ్ ప్రారంభిస్తారు.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.. 

రచయిత రాజ్ కాంత్ తోటి మాట్లాడుతూ.. ఈ కథ వినగానే సూపర్బ్ గా ఉందని అప్రిషియేట్ చేసిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్. ఈ రోజు స్టార్ట్ అయిన మా చేతక్ బండి వన్ హండ్రెడ్ పర్సెంట్ కొత్త కథ. సినిమా బాగా రావడానికి అందరం కలిసి బాగా కష్టపడతాం.  పూర్తిచేస్తాం.. హండ్రెడ్ పర్సెంట్ న్యూ సబ్జెక్ట్ ఇది. ఫస్ట్ కథవిని ఒకే చేసిన రాజ్ కందుకూరి, డైరెక్టర్ రాజేష్ కి థాంక్స్. అలాగే మా నిర్మాతలు పూర్ణ, రవి గారు కథవిని  చాలా ఇంప్రెస్ అయ్యారు.. ఇంత మంచి రోజు సినిమా స్టార్ట్ కావడం చాలా హ్యాపీగా ఉంది.. అన్నారు.

శివ కందుకూరి సరసన ఓ ప్రముఖ హీరోయిన్ నటించనున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: రాజ్ కాంత్ తోటీ,  మ్యూజిక్: అనూప్ రూబెన్స్, డివోపి: సతీష్ ముత్యాల, ఎడిటింగ్: యమ్ ఆర్ వర్మ. నిర్మాతలు: రవి చరణ్ మెరుపో, ప్రతిమ,  దర్శకత్వం: రాజేష్.

Shiva Kandukuri 4th Movie Chetak Seenu :

<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large XcVN5d tw-ta" dir="ltr"><pre id="tw-target-text" class="tw-data-text tw-text-large XcVN5d tw-ta" dir="ltr"><span lang="en">Chetak Seenu movie to be released in February 2021</span></pre> </pre>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs