రాక్‌స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో హోంబలే ఫిలింస్ నిర్మిస్తోన్న భారీ ప్యాన్ ఇండియా మూవీ కేజీయఫ్ చాప్టర్ 2 షూటింగ్ పూర్తి.. జనవరి 8న టీజర్ విడుదల
ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్యాన్ ఇండియా మూవీస్‌లో కేజీయఫ్ చాప్టర్ 2 ఒకటి. కన్నడ రాక్‌స్టార్ యశ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. భారీ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తూ మన సౌత్ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లడమే ధ్యేయంగా భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో సినిమాలను నిర్మిస్తోన్న హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. హీరో యష్ పుట్టినరోజు సందర్భంగా కేజీయఫ్ చాప్టర్ 2 టీజర్‌ను 2021, జనవరి 8 ఉదయం 10 గంటల 18 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది.
ప్యాన్ ఇండియా మూవీగా కేజీయఫ్ చాప్టర్ 1 బ్లాక్‌బస్టర్ హిట్‌తో కలెక్షన్స్ దుమ్ము రేపింది. దీనికి కొనసాగింపుగా రూపొందుతోన్న కేజీయఫ్ చాప్టర్ 2పై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలను మించేలా హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్, హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. వచ్చే ఏడాది ఈ సినిమాను గ్రాండ్ లెవల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రాఖీభాయ్‌గా యష్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో దాన్ని ఢీ కొట్టేలా అధీర పాత్ర ఉంటుంది. ఈ పాత్రను బాలీవుడ్ సంజయ్ దత్ పోషించారు. మరో కీలక పాత్రలో మరో ప్రముఖ బాలీవుడ్ నటి రవీనాటాండన్ కనిపించనున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా ప్రకాశ్ రాజ్, అనంత్ నాగ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.