Advertisement
Google Ads BL

ఓటీటీకి అమ్ముడుపోయిన ఆదాశ‌ర్మ ‘?’


ఆదాశ‌ర్మ `? ` (క్వ‌శ్చ‌న్ మార్క్ )  హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటుతో సొంతం చేసుకున్న ఓ  ప్ర‌ముఖ  సంస్థ‌!!

Advertisement
CJ Advs

శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్ గా విప్రా దర్శకత్వం లో  గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో  నిర్మించబడుతున్న నూతన చిత్రం క్వశ్చన్ మార్క్ (?).  విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోన్న ఈ చిత్రం లోని రామ‌స‌క్క‌నోడివిరో అనే పాట‌ను ఇటీవ‌ల రిలీజ్ చేయ‌గా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ర‌ఘుకుంచె స్వ‌ర‌ప‌ర‌చ‌గా మంగ్లీ ఆల‌పించగా శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేసిన ఈ పాట ప్ర‌స్తుతం యూట్యూబ్ లో మిలియ‌న్ వ్యూస్ తో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రం పోస్ట‌ర్ , సాంగ్ న‌చ్చి ఓ  ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఫ్యాన్సీ రేటుతో చిత్రాన్ని తీసుకుంది.

 ఈ సంర‌ద్భంగా చిత్ర నిర్మాత  గౌరీ కృష్ణ మాట్లాడుతూ.. ఇటీవ‌ల విడుద‌ల చేసిన మా చిత్రంలోని పాట‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ర‌ఘు కుంచె సంగీతం, శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ, మంగ్లీ వాయిస్, ఆదాశ‌ర్మ వేసిన స్టెప్స్ తో పాట‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భిస్తోంది. మా సినిమాకు సంబంధించి పోస్ట‌ర్ తో పాటు సాంగ్ న‌చ్చి ఇండ‌స్ట్రీలో మంచి బ‌జ్ క్రియేట్ చేయ‌డంతో  ఓ ప్ర‌ముఖ ఓటీటీ  సంస్థ మా సినిమాను  ఫ్యాన్సీ రేటుతో తీసుకోవ‌డం జ‌రిగింది. ఓ మంచి విడుద‌ల తేదీని చూసుకుని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తాం అన్నారు. 

Adah Sharma`? `(Question Mark) A leading company that owns the rights at a fancy rate!:

Adah Sharma`? `(Question Mark) A leading company that owns the rights at a fancy rate!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs