కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు, పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకున్న సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ ‘రౌడీబేబీ’. ఈ సినిమా షూటింగ్ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ క్లాప్ కొట్టగా, సహ నిర్మాత జీవీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కోన వెంకట్ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మరగాని భరత్, పెందుర్తి ఎమ్మెల్యే అదిప్‌రాజ్, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే అమర్‌నాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జాతీయ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘‘నేను కామెడీ చిత్రాలతో ఓ స్టార్ రైటర్‌గా ఎలా ఎదిగానో, అదే కామెడీని బేస్ చేసుకుని ప్రేక్షకులను మరోసారి నవ్వించడానికి రెడీ అయ్యాం. అద్భుతమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ..‘‘పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మా ‘రౌడీబేబీ’ చిత్రం, రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ఈరోజు నుండే ప్రారంభిస్తున్నాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సినిమాను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేశాం. ఫిబ్రవరి నెలనాటికంతా షూటింగ్ పూర్తవుతుంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు.
నటీనటులు:
సందీప్‌కిషన్, నేహాశెట్టి, బాబీ సింహ, హర్ష, వెన్నెలకిశోర్, పోసాని కృష్ణమురళి, షకలక శంకర్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: జి.నాగేశ్వర్ రెడ్డి, కథ: బాను, డైలాగ్స్: నందు, ఆర్ట్: చిన్నా, కెమెరా: సుజాత సిద్ధార్థ్, సంగీతం: చౌరస్తా రామ్, స్టంట్స్: రియల్ సతీశ్, ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్, కాస్ట్యూమ్స్: నీరజ్‌కోన, సహ నిర్మాత: జీవీ, సమర్పణ: కోన వెంకట్, నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణ, పి.ఆర్.ఓ: వంశీ కాక.