Advertisement
Google Ads BL

జనవరి ఒకటినంట.. ‘చెప్పినా ఎవరు నమ్మరు’!


శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి, విజయేందర్, రాకేష్ నటీనటులుగా ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఎం. మురళీ శ్రీనివాసులు నూతనంగా నిర్మిస్తున్న చిత్రం ‘చెప్పినా ఎవరూ నమ్మరు’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 1న విడుదల చేస్తున్న సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చిత్ర వివరాలను తెలిపింది. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా ఈ చిత్ర హీరో, దర్శకుడు ఆర్యన్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర నిర్మాణానికి అందరూ ఎంతగానో సహకరించారు. సినిమా బాగా వచ్చింది. ఈ చిత్రం విజయంతో భవిష్యత్తులో కూడా నిర్మాత మరిన్ని మంచి చిత్రాలు చేయాలి. ఈ చిత్రాన్ని గోవా, హైదరాబాద్‌లలో రెండు షెడ్యూల్లో సినిమాను పూర్తి చేసాము. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి మూవీ రాలేదు. కామెడీ థ్రిల్లర్‌తో అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే మా చిత్రం అందరికీ తప్పక నచ్చుతుంది. కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలుకుతూ సినీ ప్రేక్షకులకు న్యూ ఇయర్ గిఫ్ట్‌గా జనవరి 1న విడుదల చేస్తున్నాం. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు భయపడాల్సిన అవసరం లేదు, థియేటర్ వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా చూసి అందరి దీవెనలు మా టీమ్‌కు అందిస్తారని కోరుకుంటున్నాను..’’ అన్నారు.

చిత్ర నిర్మాత ఎం. మురళీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్‌లో నిర్మిస్తున్న ‘చెప్పినా ఎవరు నమ్మరు’ సినిమాలో న్యాచురల్ సీన్స్ ఉంటాయి. అన్నపూర్ణ స్టూడెంట్ అయిన మా అబ్బాయిని హీరోగా పెట్టి నిర్మించాను. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జనవరి 1న మీడియా మాక్స్ శ్రీనివాస్‌గారి సపోర్ట్‌తో విడుదల చేస్తున్నాము. మా బ్యానర్‌లో మరిన్ని సినిమాలను నిర్మించి మంచి పేరు తెచ్చుకుంటామని ఆశిస్తున్నాము..’’ అన్నారు..

డిస్ట్రిబ్యూటర్ మీడియా మాక్స్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘ఇది చిన్న సినిమా కాదు.. దీనికి మూడు కోట్లు ఖర్చు పెట్టారు నిర్మాతలు. ఈ సినిమాను అన్ని రాష్ట్రాల్లో 300కు పైగా థియేటర్లలో విడుదల చేస్తాం. కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో జనవరి 1న మీ ముందుకు వస్తాము..’’ అన్నారు. ఈ సినిమాలో మాకు ఇంత మంచి రోల్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు ఇందులో నటించిన విక్రమ్ విక్కి, విజయేందర్, రాకేష్.

తారాగణం:

ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి, విజయేందర్, రాకేష్ తదితరులు

సాంకేతిక విభాగం:  

బ్యానర్: శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్

నిర్మాత: ఎం. మురళి శ్రీనివాసులు

డైరెక్టర్: ఆర్యన్ కృష్ణ

సినిమాటోగ్రఫీ: బురన్ షేక్, అఖిల్ వల్లూరి

సంగీతం: జగ్దీద్ వేముల(Jagdeedh vemula)

ఎడిటర్: అనకల లోకేష్

లిరిక్స్: భాస్కరభట్ల

రీ రికార్డింగ్: ప్రజావాల్ క్రిష్

పి.ఆర్.ఓ: మధు వి.ఆర్.

Cheppina Evaru Nammaru Release Date Fixed :

<span>Cheppina Evaru Nammaru Movie Ready to New Year treat</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs