Advertisement
Google Ads BL

కోతి కొమ్మచ్చి అయిపోయిందోచ్!


విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకున్న 'కోతి కొమ్మచ్చి'

Advertisement
CJ Advs

కరోన వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ఒక సినిమా షూటింగ్ మొదలు పెట్టి కేవలం నెల రోజుల్లోనే అవుట్ డోర్ లో షూటింగ్ పూర్తి చేయడం చాలా కష్టం. అయితే ఈ అసాధ్యాన్ని దిగ్విజయంగా సుసాధ్యం చేసి చూపించారు కోతి కొమ్మచి టీం.  నవంబర్ 3న మొదలైన కోతికొమ్మచ్చి షూటింగ్ డిసెంబర్ మొదటి వారంతో ఒక్క పాట మినహా టోటల్ షూట్ పూర్తయింది. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న లు హీరోలుగా తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం కోతి కొమ్మచ్చి. లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థపై ఎం.ఎల్.వి.సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ లాక్ డౌన్ ముగిసి షూటింగ్స్ కి పర్మీషణ్ ఇచ్చిన వెంటనే కోతి కొమ్మచ్చి షూటింగ్ మొదలుపెట్టాము. సినిమా మొత్తం అవుట్ డోర్ కావడంతో కరోనా ఎఫెక్ట్ వల్ల కొంత భయం ఉన్నప్పటికీ ధైర్యం చేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎట్టకేలకు ఒక పాట మినహా టోటల్ షూటింగ్ పూర్తి చేశాం. అమలాపురం , విశాఖపట్నం , రాజమండ్రి లో ఎలాంటి బ్రేక్ లేకుండా నిర్విరామంగా షూటింగ్ జరిపాము. ఈ సందర్భంగా షూటింగ్ దిగ్విజయంగా పూర్తవ్వడానికి కారణమైన యూనిట్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. త్వరలోనే బ్యాలెన్స్ సాంగ్ ను కూడా పూర్తి చేసి విడుదల తేదిను ప్రకటిస్తాం అన్నారు.

నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ మాట్లాడుతూ కరోన కష్టకాలంలో కూడా అనుకున్న విధంగా మా సినిమా షూటింగ్ ను ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేశాం. ముఖ్యంగా మా దర్శకుడు సతీష్ గారు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో షూటింగ్ పూర్తి చేసారు. మాకు సహకరించి సినిమా కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికీ మా ప్రొడక్షన్ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. అతి త్వరలోనే సినిమా విడుదల తేదిను ప్రకటించి ప్రేక్షకులను థియేటర్స్ లో కలుసుకుంటాం అన్నారు.

హీరో -హీరోయిన్స్ : మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్ , మేఘ చౌదరి.

మిగతా నటీ నటులు : రాజేంద్ర ప్రసాద్ , వి.కే. నరేష్, సిజ్జు , అన్నపూర్ణమ్మ, రాజ శ్రీ నాయర్,  మణి చందన , ప్రవీణ్, సుదర్శన్, శివన్నారాయణ, ఆనంద్ వర్మ ,చింటు , రచ్చరవి తదితరులు

Kothi Kommachi, a song shoot away from completion!:

<span>Kothi Kommachi, a song shoot away from completion!</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs