బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అయిన దగ్గరనుండి బోరింగ్ టాస్క్ లతో బుల్లితెర ప్రేక్షకులు బాగా బోర్ ఫీలవుతున్నారు. చప్పని టాస్క్ లు, కంటెస్టెంట్స్ నీరసాలు అబ్బో ఆఖరికి చివరి వారం వచ్చినా బిగ్ బాస్ లో మజా లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేవు. చివరి రెండు వారాల్లో ఆరియానా - సోహైల్ గొడవ , మోనాల్ ఏడుపు తప్ప బిగ్ బాస్ కి ఎలాంటి కంటెంట్ లేదనే చెప్పాలి. అందుకే టైం కూడా మార్చేశారు. రాత్రి 10 గంటలకి బిగ్ బాస్ ప్రసారమవడంతో సుత్తి బిగ్ బాస్ ఎవరు చూస్తారంటూ టివి ఆపేస్తున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు. చివరి రెండు వారాలకు బిగ్ బాస్ కి కనీసం గంట కంటెంట్ దొరకడం లేదంటే కంటెస్టెంట్స్ ఆట, బిగ్ బాస్ పాట ఎంత చిరాగ్గా ఉన్నాయో తెలుస్తుంది. బిగ్ బాస్ చూడాలంటె నరకంగా అనిపిస్తుంది అంటూ చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ చెబుతున్న మాట.
కరోనా టైం ఇంట్లోనే ఉంటున్నాం.. బిగ్ బాస్ అయినా ఉపశమనం ఇస్తుందేమో అనుకుని ఊసిపోక టివి ఆన్ చేస్తే.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అరుపులు, కేకలు, ఏడుపులు తప్ప మరేమి లేదు. అరియానా ని సోహైల్ బ్యాడ్ చేస్తుంటే.. సోహైల్ ని అరియనా బ్యాడ్ చెయ్యడం, కెమెరాలముందు మాట్లాడడం అబ్బో.. ఇంతకు మించి బిగ్ బాస్ లో మరో ఆసక్తికరమైన ఆట లేదు. గత వారం రోజులుగా హౌస్ అంతా డల్.. అవినాష్ లేని లోటు స్పష్టంగా కనబడుతుంది. అవినాష్ కామెడీ ఉన్నా హౌస్ కాస్త కళగా ఉండేది. అవినాష్ ఎలిమినేషన్ బిగ్ బాస్ కి పెద్ద దెబ్బ. మోనాల్ ని గ్లామర్ కోసం ఉంచి తప్పు చేశామనే భావనలో బిగ్ బాస్ యాజమాన్యం ఉందట. మరి ఈ వారం అయినా మోనాల్ ని పంపుతారో లేదంటే అరియనా - హరికల్లో ఎవరికి స్పాట్ పెట్టి బుల్లితెర ప్రేక్షకుల సహనానికి పరీక్షా పెడతారో చూడాలి