Advertisement
Google Ads BL

నిహారిక వెడ్డింగ్ లో అవే హైలెట్!


నాగబాబు కూతురు నిహారిక పెళ్లి రాజస్థాన్ ఉదయపూర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం కొత్త జంట హైదరాబాద్ లో అడుగుపెట్టింది. నిహారిక పెళ్లి జరిగి రెండు రోజులవుతున్నా సోషల్ మీడియాలో నిహారిక పెళ్లి విషయాలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు నిహారిక పెళ్ళిలో తెగ హైలెట్ అయిన విషయాలలో ముఖ్యమైనవి రామ్ చరణ్ - ఉపాసన, అల్లు అర్జున్ - స్నేహ రెడ్డిల డ్రెస్ ల విషయాలు. అల్లు అర్జున్ వైఫ్ ఏ డిజైనర్ తో బట్టలు డిజైన్ చేయించింది అంటే.. చరణ్ వైఫ్ ఉపాసన ఏ డిజైనర్ తో డిజైన్ చేయించింది అంటూ సోషల్ మీడియాలో నిహ పెళ్లి విషయాలు పక్కనబెట్టి ఇప్పుడు డ్రెస్సులు, స్టయిలిష్ అలాగే వాటి ధరల మీది ఫోకస్ పెట్టారు నెటిజెన్స్. 

Advertisement
CJ Advs

రాజస్థాన్ ఫ్లైట్ ఎక్కిన దగ్గరనుండి అల్లు అర్జున్ భార్య స్నేహ ఏ డ్రెస్ వేసుకుంది దాని కాస్ట్ ఎంత, ఉపాసన ఎయిర్ పోర్ట్ లుక్ డ్రెస్ వాల్యూ ఎంత, ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర ఎంత అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజెన్స్. మరి అల్లు అర్జున్ - స్నేహ ల జంట నిహారిక పెళ్ళిలో చాల అంటే చాలా స్పెషల్ గా కనిపించారు. అల్లు అర్జున్ - స్నేహాలు బాలీవుడ్ బడా డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్సులతో నిహారిక పెళ్లి, ఇతర కార్యక్రమాల్లో అదరగొట్టేసారు. వాటి విలువ లక్షల్లోనే ఉంటుందట. స్నేహ ఫ్లైట్ ఎక్కిన రోజు వేసిన డ్రెస్ కాస్ట్ 14 వేలు ఉంటుందని, ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర 2,47,620 అని, అలాగే నిహారిక సంగీత్ లో స్నేహ వేసుకున్న డ్రెస్ ధర ఏకంగా 4,35,000 రూపాయలు ఉంటుందట.

ఇక చరణ్ భార్య ఉపాసన కూడా ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్పెషల్ గా డిజైన్ చేసిన డ్రెస్సులతో నిహారిక పెళ్ళిలో సందడి చేసింది. మరి నిహారిక బట్టలు, ఆమె వెసుకున్న ఆభరణాల విలువ కోట్లలో ఉంటుంది కానీ.. చిరు కూతుళ్లు, స్టార్ వైఫ్ లు ఉపాసన, స్నేహా వేసుకున్న బట్టలు విలువ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నాయి.

Niharika Wedding Highlights!:

Nischay Wedding: sneha and Upasana Dresses and Accessories trending
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs