తమిళ టీవీ నటి వీజే చిత్ర ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు 28. పాండియన్ స్టోర్స్‌లో పాపులర్ షోలో ముల్లై పాత్ర వల్ల VJ చిత్రకు మంచి పేరు వచ్చింది. VJ చిత్ర ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. టీవీ, సినిమా అభిమానులకు ఈ వార్త షాక్ ఇచ్చింది. ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉరి వేసుకున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. వీజే చిత్రా ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పూర్తి చేసి, ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటలకు తన హోటల్ గదికి తిరిగి వచ్చారని చెబుతున్నారు. ఆమె తన కాబోయే భర్త, వ్యాపారవేత్త హేమంత్‌తో కలిసి ఉంటున్నది, ఆమెకు కొన్ని నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది.
వీజే చిత్ర తమిళ పరిశ్రమలోని వివిధ టీవీ ఛానెళ్లలో పని చేసింది. ప్రస్తుతం ఆమె పాండియన్ స్టోర్స్ సీరియల్‌లో కనిపించింది. ముల్లై పాత్ర ద్వారా చాలా మంది అభిమానులను సంపాదించింది. ఆమె అందచందాలతో విలక్షణ నటనతో అందమైన ఫోటోలతో అభిమానులను అలరించేది. ఆమె మరణం ఆమె అభిమానులను నిరాశకు గురిచేసింది.