సింగర్ సునీత పరిచయం అక్కర్లేని పేరు. సినిమా ఇండస్ట్రీలో టాప్ సింగర్ సునీత. పెద్ద సినిమాలకి సింగర్ గాను, స్వరాభిషేకం, పాడుతా తీయగా షోస్ లో సునీత అంటే తెలియని వారుండరు. చిన్నప్పటి నుండి సంగీతం అంటే ఇష్టపడే సునీత డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను సుపరిచితరాలే. టాప్ సింగర్, అలాగే టాప్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పిన సునీత రియల్ లైఫ్ లో ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొంది. చిన్న వయసులోనే (19 ఏళ్లకే) కిరణ్ కుమార్ గోపరాజు ని పెళ్లి చేసుకున్న సునీత ఇద్దరు పిల్లలకి తల్లి కూడా అయ్యింది. అయితే కొన్ని సంవత్సరాలు భార్య భర్తల విభేదాలతో సునీత జంట విడాకులు తీసుకుంది. అప్పటినుండి తన ఇద్దరి పిల్లల్తో కలిసి ఒంటరి జీవితం గడుపుతున్న సునీత రెండో పెళ్లి పై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త ప్రచారంలో ఉండేది.
సునీత మాత్రం తన రెండో పెళ్లి వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చేది. కానీ తాజాగా సునీత రెండో పెళ్లి విషయం మళ్ళీ ప్రచారంలో ఉండగానే.. సునీత ఎంగేజ్మెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సునీత రెండో పెళ్లి చేసుకోబోయేది ఎవరిని అంటే.. ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ అధినేత మంగ రామ్ ని సునీత రెండో వివాహం చేసుకోబోతుంది. రామ్ పేరెంట్స్ - సునీత పేరెంట్స్ మధ్యన సునీత నిశ్చితార్ధం చాలా నిరాడంబరంగా జరిగింది. అయితే తన రెండో పెళ్లి విషయాన్నీ, తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ ని సునీతే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనని అర్ధం చేసుకుని తన లైఫ్ లోకి ఎంటర్ అయిన రామ్ కి థాంక్స్ చెబుతూ సునీత ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ఇక సునీత నిశ్చితార్థంలో ఆమె ఇద్దరు పిల్లలు కూడా కనిపించడం గమనార్హం.