Advertisement
Google Ads BL

ఐతే పెద్ద సినిమాల రేంజ్ లో 'ఉప్పెన'


'ఉప్పెన'లోని నీ క‌న్ను నీలి స‌ముద్రం పాట‌కు 150 మిలియ‌న్ వ్యూస్‌.

Advertisement
CJ Advs

పంజా వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి జంట‌గా సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతో మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా, ఇప్ప‌టికే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యిన నీ క‌న్ను నీలి స‌ముద్రం సాంగ్ లేటెస్ట్‌గా మ‌రో మైలురాయిని అందుకుంది. శ్రీ‌మ‌ణి, ర‌ఖీబ్ ఆల‌మ్ రాయ‌గా, జావెద్ అలీ, శ్రీ‌కాంత్ చంద్ర పాడిన ఈ సాంగ్ లిరిక‌ల్ వీడియో యూట్యూబ్‌లో 150 మిలియ‌న్ వ్యూస్‌ను సాధించింది. ఈ పాట‌ను వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి జంట‌పై చిత్రీక‌రించారు.

ఇటీవ‌ల విడుద‌లైన 'ధ‌క్ ధ‌క్', 'రంగుల‌ద్దుకున్న' పాట‌లు కూడా మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను బాగా అల‌రిస్తున్నాయి. త‌న మ్యూజిక్ టేస్ట్‌తో, పాట‌ల‌ను ప్రెజెంట్ చేసిన విధానంతో అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకున్న ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంభాష‌ణ‌ల‌ను అందిస్తున్నారు.

త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క పాత్ర చేస్తున్న 'ఉప్పెన' చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. త్వ‌ర‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

తారాగ‌ణం: పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, కృతి శెట్టి, సాయిచంద్‌, బ్ర‌హ్మాజీ

సాంకేతిక బృందం: క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా, నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌, బ్యాన‌ర్స్‌:  మైత్రి మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌, సీఈవో: చెర్రీ.

మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ:  షామ్‌ద‌త్ సైనుద్దీన్‌, ఎడిటింగ్‌: న‌వీన్ నూలి, ఆర్ట్‌: మౌనిక రామ‌కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: అనిల్ వై, అశోక్ బి. పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌, మ‌ధు మ‌డూరి. 

Nee Kannu Neeli Samudram Song In Uppena Gets 150 Million Views:

<span>Kollywood star hero Vijay Sethupathi will be seen in an intense role in the film.</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs