కరోనా లాక్ డౌన్ టైం లో ఎంతో సాహసం చేసి స్టార్ మా బిగ్ బాస్ ని మొదలు పెట్టింది. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ ని పది రోజుల పాటు హోటల్ రూమ్స్ లో క్వారంటైన్ లో పెట్టి మరీ బిగ్ బాస్ కి తీసుకొచ్చారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా క్వారంటైన్ పూర్తి చేసుకున్నవారే. కరోనా తో ఎన్నో జాగ్రత్తల మధ్యన మొదలైన ఈ రియాలిటీ షో చివరి రెండు వారాల్లోకి అడుగుపెట్టింది. ఇక బిగ్ బాస్ షోకి వచ్చి.. హౌస్ లోకి వెళ్లి మరీ తమ సినిమాలను ప్రమోట్ చేసుకునే సెలబ్రిటీస్ ఈ కరోనా వలన హౌస్ లోకి అడుగుపెట్టలేదు. మరోపక్క కొంతమంది సెలబ్రిటీస్ బిగ్ బాస్ స్టేజ్ మీదకే పరిమితమయ్యారు కానీ.. వాళ్ళని హౌస్ లోకి వెళ్లనివ్వలేదు.
మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న బిగ్ బాస్ యాజమాన్యం ఇప్పుడు బిగ్ బాస్ లాస్ట్ వీక్ హౌస్ పార్టీని నిర్వహిస్తుందా.. హౌస్ పార్టీ అంటే.. ఇప్పటివరకు ఎలిమినేట్ అయ్యి వెళ్లిన కంటెస్టెంట్స్ అందరిని బిగ్ బాస్ హౌస్ లోకి తెచ్చి.. మిగిలిన కంటెస్టెంట్స్ తో పార్టీ నిర్వహించడం. అయితే ఇప్పుడు ఈ కరోనా టైములో అలాంటి పార్టీ ఒకటి ఉంటుందా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఎలిమినేట్ అయినా కంటెస్టెంట్స్ అందరూ హౌస్ లో వెలిగిపోతూ, డిజైనర్ వేర్ డ్రెస్సులతో గ్లామర్ ఒలకబోస్తూ పార్టీని ఎంజాయ్ చేస్తారు. కానీ కరోనా వలన ఈసారి బిగ్ బాస్ హౌస్ పార్టీ ఉండకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ ఎలిమినేషన్స్ సభ్యులను హౌస్ లోకి పంపాలంటే మళ్లీ 10 రోజుల క్వారంటైన్ చెయ్యాల్సి ఉంటుంది.. అందుకే ఈసారి బిగ్ బాస్ హౌస్ పార్టీని లైట్ తీసుకుంటుంది అని అంటున్నారు.